'సాక్షి'కి మ‌ద్ద‌తిచ్చిన చిరు

'సాక్షి'కి మ‌ద్ద‌తిచ్చిన చిరు

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, ప్రముఖ నటుడు చిరంజీవి కాపుల అంశంపై ఆస‌క్తిక‌రంగా స్పందించారు. కాపునాడు నేత‌ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ విష‌యంలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాపుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని చిరంజీవి ఆరోపించారు. ఈ క్ర‌మంలో తాజాగా ఆయ‌న చంద్ర‌బాబు ప్ర‌భుత్వం తీరుపై లేఖను విడుదల చేశారు. ముద్రగడ వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను నిలిపేయడం ప్రభుత్వ నియంతృత్వ పాలనకు పరాకాష్ట అని చిరంజీవి అభివర్ణించారు. త‌ద్వారా ప‌రోక్షంగా ఆయ‌న సాక్షికి మ‌ద్ద‌తిచ్చారు.

తునిలో జరిగిన హింసాత్మక ఘటనలను ఎవరూ సమర్థించరని, బాధ్యులను గుర్తించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సిందేన‌ని ఈ లేఖ‌లో చిరంజీవి స్ప‌ష్టం చేశారు. అయితే తుని ఘటనలను పురస్కరించుకుని చేస్తున్న అరెస్ట్ లు ఏకపక్షంగా ఉన్నాయని చిరంజీవి అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. తుని ఘటనలో గోదావరి జిల్లాల వాసులు ఎవరూ లేరని చెప్పిన చంద్రబాబు, ఇప్పుడు అక్కడ చేస్తున్న అరెస్ట్ లను ఏవిధంగా సమర్థించుకుంటారని ప్రశ్నించారు.

ముద్రగడ పద్మనాభం పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరి ఘర్షణాత్మకంగా ఉందని చిరంజీవి న్నారు. సున్నితమైన సామాజిక సమస్యల పరిష్కారంలో ప్రదర్శించాల్సిన రాజకీయ పరిణితి లేకుండా కక్షగట్టినట్లు వ్యవహరించడం ప్రజాస్వామ్యంలో తగదని చిరంజీవి అన్నారు. తుని ఘటన అంశంలో ప్రభుత్వం సంయమనం పాటించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. ముద్ర‌గ‌డ‌ చేస్తున్న దీక్షకు రాజకీయాల్ని ఆపాదించి  సమస్యను పక్కదారి పట్టించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ముఖ్యమంత్రికే తెలియాలన్నారు. సీబీఐ విచారణ ద్వారానే తుని ఘటన నిందితుల్ని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు