మోడ‌ర్నా వ్యాక్సిన్ సూప‌ర్ స‌క్సెస్.. కానీ లాభం లేదు

A medical syringe and a vial in front of the Moderna logo are seen in this creative illustrative photo. More than one hundred fifty COVID-19 coronavirus vaccine are in development across the world, several of which have the third phase of clinical trials, as media reported. (Photo illustration by STR/NurPhoto via Getty Images)

గ‌త కొన్ని రోజులుగా ఆ వ్యాక్సిన్.. క‌రోనాపై ఇంత శాతం విజ‌య‌వంతంగా ప‌ని చేస్తోంద‌ట‌.. ఈ వ్యాక్సిన్ ఇంత స‌క్సెస్‌ఫుల్‌గా ఉంద‌ట అని వార్త‌లు చూస్తూనే ఉన్నాం. ఆక్స్‌ఫ‌ర్డ్, ఆస్ట్రాజెనికా, ఫైజ‌ర్ లాంటి సంస్థ‌లు త‌యారు చేసిన వ్యాక్సిన్‌లు 60 నుంచి 95 శాతం వ‌ర‌కు క‌రోనా వైర‌స్‌ను నియంత్రిస్తున్న‌ట్లు అంత‌ర్జాతీయంగా క‌థ‌నాలు వ‌చ్చాయి.

కాగా ఇప్పుడు అమెరికా సంస్థ మోడర్నా త‌యారు చేస్తున్న వ్యాక్సిన్ ప్ర‌యోగ ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. తీవ్ర స్థాయి క‌రోనా రోగుల‌కు ఈ వ్యాక్సిన్ ఇవ్వ‌గా అది నూటికి నూరు శాతం సానుకూల ఫ‌లితాలు ఇచ్చిన‌ట్లుగా ఆ సంస్థ వెల్ల‌డించింది. ఇది ప్ర‌పంచానికి గొప్ప శుభ‌వార్తే అని చెప్పాలి. ఐతే కానీ అంద‌రికీ ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చేస్తుంద‌ని సంబ‌రప‌డాల్సిన ప‌నైతే లేదు.

ముఖ్యంగా భార‌తీయుల‌కు ఈ వ్యాక్సిన్ ద‌క్కే అవ‌కాశాలే లేవు. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ధ‌ర చాలా ఎక్కువ‌. మామూలుగా క‌రోనా వ్యాక్సిన్ డోస్ ప్ర‌తి వ్య‌క్తికీ రెండుసార్లు వేయాల్సి ఉండ‌గా.. మోడ‌ర్నా వ్యాక్సిన్ఒక్క డోస్ 32 నుంచి 37 డాల‌ర్ల దాకా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం. వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న అన్ని దేశాల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న భార‌త ప్ర‌భుత్వం.. మోడ‌ర్నాతో కూడా ఇంత‌కుముందే మాట్లాడింది. ఐతే వాళ్లు ఆ ధ‌ర‌కు త‌గ్గేది లేద‌న‌డంతో వారితో ఒప్పందం చేసుకోలేదు.

ఒక్క డోస్ కోసం అటు ఇటుగా రూ.2500, రెండు డోస్‌ల కోసం రూ.5 వేలు ఖ‌ర్చు చేయాలంటే క‌ష్ట‌మే. అంత ధ‌ర‌తో వ్యాక్సిన్ తెచ్చి సామాన్యుల‌కు అందించ‌డం ప్ర‌భుత్వాల‌కు పెనుభార‌మే అవుతుంది. నిజానికి భార‌త్ ఈ ధ‌ర‌లో ప‌ది శాతానికి ఒక్క‌ వ్యాక్సిన్ డోస్ కొనాల‌ని చూస్తోంది. అస్ట్రాజెనికా వ్యాక్సిన్ ధ‌ర భార‌త్ కోరుకున్న‌ట్లే 3-4 డాల‌ర్ల మ‌ధ్య ఉండే అవ‌కాశాలున్నాయి. ఇలా త‌క్కువ ధ‌ర‌కు వ్యాక్సిన్ ఇచ్చే సంస్థ‌ల వైపు భార‌త్ చూస్తోంది. దీంతో పాటుగా దేశీయంగా భార‌త్ బ‌యోటెక్ స‌హా కొన్ని సంస్థ‌లు క‌రోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ముమ్మ‌ర కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే.