వైఎస్సార్ కాంగ్రెస్ లో మరో ‘డెకాయిట్’

వైఎస్సార్ కాంగ్రెస్ లో మరో ‘డెకాయిట్’

మిగిలిన పార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్ కు  తేడా చాలా ఎక్కువ. స్వార్థం కోసం.. అధికారం కోసం పుట్టిన ఆ పార్టీలో ఉన్న వారిపై వస్తున్న ఆరోపణులు కూడా చాలా చిత్రంగా ఉంటున్నాయి. మరే ఇతర పార్టీల్లో లేని విధంగా నేరచరిత ఒక్కొక్కటీ బయటకు వస్తున్నాయి. మొన్నటికి మొన్న ఎటీఎం హత్య కేసులో శ్రీధర్ రెడ్డి  దొరికిపోతే.. దొంగనోట్ల వ్యాపారం చేస్తూ నాగ మల్లేశ్వరి పోలీసులకు దొరికిపోయారు. తాజాగా.. తక్కువ రేటుకి బంగారం ఇప్పిస్తామంటూ అమాయకులను మోసం చేస్తూ కోట్ల రూపాయిలు నొక్కేసిన ఘరానా దొంగ సిద్ధార్థరెడ్డి పోలీసుల చేతికి చిక్కాడు. వైఎస్సార్ కాంగ్రెస్ అంటే మీకు కోపం. అందుకే అలా విరుచుకుపడతారన్న సందేహం అక్కర్లేదు. ఎందుకంటే.. సిద్ధార్థరెడ్డికి జగన్ చాలా ఆప్ప్తుడు. ఇతగాడు రోడ్డు ప్రమాదంలో  గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వెళ్లి.. సిద్ధార్థరెడ్డిని పరామర్శించి మరీ వచ్చారు.

గత రెండేళ్లుగా పార్టీలో యాక్టివ్ గా ఉండే సిద్దార్థరెడ్డి.. నిజామాబాద్ జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో ఒకరు. రానున్న 2014 ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా దాదాపుగా కన్ఫర్మ్ అయిపోయిన వ్యక్తి. ఎల్లారెడ్డి నియోజకవర్గంతో పాటు.. నిజామాబాద్ జిల్లాలో వైఎస్సార్ పార్టీ బలోపేతం అయ్యేందుకు అవసరమైన ప్రచారానికి కోట్లాది రూపాయిల్ని అలవోకగా ఖర్చు చేసే వ్యక్తిగా అతనికి చాలా పెద్ద పేరుంది. ఇక... మనోడి లీలల గురించి చెప్పాల్సి వస్తే.. షార్ట్ కట్ లో డబ్బులు సంపాదించాలనుకునే బకరాలను ముందుగా సెలెక్ట్ చేసుకుంటాడు. వారికి.. తక్కువ ధరకే బంగారం ఇస్తానని నమ్మబలుకుతాడు. వారి దగ్గర నుంచి భారీగా డబ్బు వసూలు చేసి.. తర్వాత టోపీ పెడతాడు. అదేమంటే.. ఎదురు తిరుగుతాడు. తన ప్రతాపం చూపిస్తాడు. మారు మాట్లాడలేక.. కుక్కిన పేనులా బాధితులు పడి ఉంటారు.

ఇతగాడికి మరో లేడీ డెకాయిట్ హైదరాబాద్ కు చెందిన జయంతిని కలుపుకొని ఈ దందా నిర్వహిస్తుంటాడు. ఇలా తమ వ్యాపారాన్ని మూడు పువ్వులు.. ఆరుకాయలుగా మార్చుకుంటూ సాగిపోతున్న తరుణంలో అనంతపురం జిల్లాకు చెందిన డి. అన్వేష్ నుంచి పెద్దమొత్తంలో డబ్బు తీసుకొని మోసగించారు. అదే విధంగా హైదరాబాద్ కు చెందిన రసూల్ పురా వాసి వెంకటకుమార్ కూడా కోటిన్నర రూపాయిలు ఇచ్చాడు. ఇతన్ని మోసగించటంతో.. సదరు వెంకట కుమార్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో తీగ లాగిన పోలీసులకు సిద్ధార్థ రెడ్డి డొంక మొత్తం కదిలింది. దీంతో ఇతన్ని.. ఇతని లేడీ పార్టనర్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. జైలుకు తరలించారు. మొత్తానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో భారీ ముదుర్లే ఉన్నట్లున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు