ఎన్టీఆర్ తో ఫోన్ లోనే అన్నీ!

ఆర్.ఆర్.ఆర్. చిత్రం కోసం ఇంకొద్ది రోజుల పాటు పని చేస్తే తారక్ పని అయిపోతుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా మొదలు పెట్టేస్తాడు. అయితే ఈ కరోనా సంక్షోభం వల్ల అదెప్పటికి జరుగుతుందనేది తెలీదు. అయితే ఈ లాక్ డౌన్ వల్ల ఎక్కువ సమయం దొరకడంతో త్రివిక్రమ్ కథ పక్కాగా సిద్ధం చేసుకుంటున్నాడు.

అరవింద సమేత చేసినప్పుడు ఎన్టీఆర్ కూడా స్క్రిప్ట్ డిస్కషన్ లో కూర్చునేవాడు. ఈసారి లాక్ డౌన్ వల్ల ఎవరింటికి వాళ్లే పరిమితం అయ్యారు. అయినా కానీ ఎన్టీఆర్ స్క్రిప్ట్ గురించి ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ తో చర్చిస్తున్నాడు. త్రివిక్రమ్ రాసిన సన్నివేశాల గురించి వీడియో కాల్స్ ద్వారా ఇద్దరు గంటలు గంటలు మాట్లాడుకుంటూ కావాల్సిన విధంగా మలచుకుంటున్నారట.

ఇప్పటికే కథ చాలా వరకు రెడీ అయిందని, మరో నెల రోజుల్లో స్క్రిప్ట్ లాక్ అయిపోతుందని తెలిసింది. ఒకసారి అది లాక్ అయిపోతే త్రివిక్రమ్ డైలాగ్ వెర్షన్ కి వెళ్తాడు. ఎన్టీఆర్ ఇక ఆర్.ఆర్.ఆర్. బాలన్స్ పని కోసం చూస్తాడు. మొత్తానికి ఈ లాక్ డౌన్ వల్ల ఎన్టీఆర్ పనులు అటు ఇటు అయ్యాయి తప్ప పూర్తిగా ఆగిపోలేదన్నమాట.