రామ్ చరణ్ పై నిరసన ఇలా చూపించాడు!

కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టిన కొరటాల శివ అక్కడ మూడేళ్ళ పాటు ఇరుక్కుపోయాడు. ఆచార్య షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే క్లారిటీ ఇంకా లేదు. రామ్ చరణ్ మాట మీద ఆచార్య కోసం కొరటాల అలా ఉండిపోయాడు. కరోనా కేసులు కంప్లీట్ గా తగ్గిపోయేవరకు షూటింగ్ చేసేది లేదని చిరంజీవి తేల్చేయడంతో కొరటాల శివ బాగా అసహనంగా ఉన్నాడని కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఆచార్య తర్వాత చరణ్ తో సినిమా చేయడానికి అప్పట్లో కొరటాల ఆసక్తి చూపించాడు. కానీ మెగా కాంపౌండ్ లో కొరటాల అంత కంఫర్టబుల్ గా లేక చరణ్ తో సినిమా ఇప్పట్లో వద్దనుకున్నాడట. కొరటాల తదుపరి చిత్రం ఇంకా ఎవరితోనూ లాక్ అవలేదని తెలిసి అల్లు అర్జున్ అతడిని విడిచి పెట్టకుండా కాంటాక్ట్ చేస్తూ #ఏఏ21 ప్రాజెక్ట్ అనౌన్స్ చేయించాడని చెప్పుకుంటున్నారు.

ముందే చరణ్ తో కొరటాల శివ సినిమా బండ్ల గణేష్ బ్యానర్లో పూజ జరుపుకుంది. ఇప్పటికి కూడా ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ కాకపోవడం మెగా అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.