సారీ చెప్పక తప్పింది కాదు!

June 4th, 2013, 11:57 PM IST
సారీ చెప్పక తప్పింది కాదు!

చేతికొచ్చింది రాసేయడం పూరీకి మొదట్నుంచీ అలవాటే. ఏదో ఒక వివాదాస్పద డైలాగ్ రాస్తూనే ఉంటాడు. కాకపోతే అవి ఎవరికీ బాధ కలిగించనంత వరకూ బాగుంటాయి కానీ, తేడా వస్తే విషయం మామూలుగా ఉండదు. ఆ విషయం ఇప్పటికి తెలిసొచ్చింది మనోడికి. ఇద్దరమ్మాయిలతో చిత్రంలో రాసిన ఓ డైలాగ్ కారణంగా క్షమాపణ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది పూరీ సాబ్ కి. అతడు రాసిన 'ప్రతి ఎదవా పవన్ కళ్యాణ్ కి ఫ్యానే' అన్న డైలాగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ గుండెల్లో మంట పుట్టించింది. మమ్మల్ని బాధపెట్టేలా ఉన్న ఆ డైలాగ్ ని మర్యాదగా తొలగిస్తారా లేదా అంటూ తూర్పు గోదావరి వపన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు విరుచుకు పడ్డారు.

మొదట సైలెంట్ గా ఉన్నా, తర్వాత మెల్లగా సమర్థించుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో క్షమించమంటూ వేడుకున్నాడు పూరీ సాబ్. మీ మనసును నొప్పిస్తే క్షమించండి అన్నాడు దిగివచ్చి. అది కాంప్లిమెంట్ మాత్రమేనట. ఆ డైలాగ్ చూసి చిరంజీవి నవ్వుకున్నారట. అల్లు అరవింద్ ఎంజాయ్ చేశాడట. బన్నీకయితే ఎంతో నచ్చిందని అన్నాడు. వాళ్లెందుకు ఎంజాయ్ చేయరు! అన్నది వాళ్లని కాదు కదా!

TAGS : Pawan Kalyan, Pawan Kalyan Fans, Puri jagannath, Iddarammayilatho, Allu Arjun