ఐరెన్‌లెగ్‌ బేబీని పట్టుకుపోయారు

ఐరెన్‌లెగ్‌ బేబీని పట్టుకుపోయారు

అందంగా ఉంటుందని మార్కులు వేయించుకున్నా కానీ దీక్షా సేత్‌కి అదృష్టం మాత్రం కలిసి రాలేదు. ఆమె నటించిన సినిమాలన్నీ వరుసగా టపా కట్టేయడంతో దీక్షా సేత్‌కి ఆఫర్లు కరువయ్యాయ్‌. తెలుగు, తమిళంలో అవకాశాలు ఆవిరైపోవడంతో ఆమె ఇప్పుడు బాలీవుడ్‌ బాట పట్టింది. ఆమెకి సుడి తిరిగి అక్కడ సైఫ్‌ అలీ ఖాన్‌ ప్రొడక్షన్‌లో ఛాన్స్‌ దక్కింది.అరడజనుకి పైగా సినిమాల్లో నటించినా కానీ ఆవగింజంత అయినా నటన నేర్చుకోలేదనే కంప్లయింట్‌ దీక్షపై ఉంది. కేవలం ప్రెట్టీ ఫేస్‌తో నెట్టుకురావాలని చూసిన దీక్ష ఇప్పుడైనా కాస్త నటన నేర్చుకుందో లేదో మరి.

బాలీవుడ్‌లో అంత కాంపిటీషన్‌లో ఎంతో టాలెంట్‌ ఉన్న వారే నిలబడలేకపోతున్నారు. దక్షిణాది హీరోయిన్లకి అయితే హిట్లు వచ్చినా కానీ స్టార్‌డమ్‌ రావడం లేదు. దీక్షా సేత్‌కి అక్కడ ఫ్యూచర్‌ ఎలాగుంటుందో చూడాలి. అక్కడ క్లిక్‌ అయితే మళ్లీ సౌత్‌లో ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయని ఆమె డ్రీమ్స్‌ వేసుకుంటోంది. ఇక్కడ ఫ్లాపయినా అక్కడ తొలి సినిమాతోనే హిట్‌ కొట్టిన తాప్సీలా దీక్ష కూడా హిట్‌ కొట్టి చూపిస్తుందేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు