వాహ్‌... తమన్నాహ్‌!

June 5th, 2013, 10:53 AM IST
వాహ్‌... తమన్నాహ్‌!

'హిమ్మత్‌వాలా'తో బాలీవుడ్‌కి ఇంకో శ్రీదేవి దొరికేసిందని ఆ చిత్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్‌ తెగ డప్పు వేశాడు. అయితే తమన్నాకి ఆ చిత్రంతో విమర్శలే అధికంగా వచ్చాయి. ఆమెకి బొత్తిగా యాక్టింగ్‌ రాదని అక్కడి క్రిటిక్స్‌ తేల్చి పారేశారు. కేవలం స్కిన్‌ షోతో నెట్టుకు వచ్చే హీరోయిన్ల కోవలో పడేశారు.

అయితే ఆమెని శ్రీదేవితో పోల్చిన సాజిద్‌ ఖాన్‌ మాత్రం అందుకు కట్టుబడే ఉన్నాడు. ఆమెకి బ్రేక్‌ ఇవ్వలేకపోయిన ఆ దర్శకుడు ఇంకోసారి తమన్నాని తన సినిమాలో హీరోయిన్‌గా ఎంచుకున్నాడు. సైఫ్‌ అలీ ఖాన్‌తో తీస్తున్న సినిమాలో తమన్నాని ఓ కథానాయికగా తీసుకున్నాడు. అలాగే హిమ్మత్‌వాలాతో తనకి పరిచయమైన తమన్నాని అజయ్‌ దేవ్‌గణ్‌ కూడా ఎంకరేజ్‌ చేస్తున్నాడు. తన తదుపరి చిత్రంలో తమన్నాకి పిలిచి మరీ ఆఫరిచ్చాడు.

హిమ్మత్‌వాలా చూసిన జనాలకి తమన్నా నచ్చినా నచ్చకపోయినా కానీ అది తీసిన వారికి మాత్రం ఆమె బాగా గుచ్చుకుంది. అందుకే వాహ్‌ తమన్నాహ్‌... అంటూ ఆమెకి మళ్లీ మళ్లీ ఆఫర్లిస్తున్నారు. ఈ సినిమాలు క్లిక్‌ అయితే తమన్నా అక్కడ బిజీ అయిపోతుందేమో మరి.

TAGS : Tamanna, Himmatwala, Ajay Devgan, Sajid Khan, Tamanna in Bollywood,