కథలు చెప్తే ఎవడికీ ఎక్కవ్‌!

కథలు చెప్తే ఎవడికీ ఎక్కవ్‌!

'ఇద్దరమ్మాయిలతో' సినిమాకి టాక్‌ ఎలా ఉన్నా కలెక్షన్లు కుమ్మేస్తోందని పూరి జగన్నాథ్‌ హ్యాపీగా ఉన్నాడు. అతని గత 'హిట్‌' బిజినెస్‌మేన్‌కి కూడా ఇదే జరిగింది. టాక్‌ వీక్‌గా ఉన్నా కానీ కలెక్షన్లు తెచ్చుకుని కమర్షియల్‌గా మంచి పొజిషన్‌ చేరుకుంది.

ఇద్దరమ్మాయిలతోకి డివైడ్‌ టాక్‌ రావడానికి కారణం సెకండాఫ్‌ నచ్చకపోవడమే అనేది పూరి అంగీకరిస్తున్నాడు. అయితే ద్వితీయార్థంలో కథ ఉందని, అందుకే జనం ఇష్టపడడం లేదని, కథ లేకుండా ఎంత సేపు ఏమి చేసినా కానీ వారు ఎంజాయ్‌ చేస్తారని, ఒక్కసారి కథ చెప్పడం మొదలు పెడితే బోర్‌ ఫీల్‌ అవుతారని మన ప్రేక్షకుల అభిరుచిపైన వ్యంగ్యాస్త్రం సంధించాడు.

త్వరలో అల్లు అర్జున్‌తో ఇంకో సినిమా చేస్తానని, అలాగే మహేష్‌తో కూడా ఓ చిత్రం ఉంటుందని, తర్వాత ఇడియట్‌, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలని హిందీలో రీమేక్‌ చేస్తానని తన భవిష్యత్‌ ప్రణాళిక గురించి పూరి జగన్నాథ్‌ చెప్పుకొచ్చాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు