అందుకే ఈ దర్శకుడిమీద ప్రేమ

అందుకే ఈ దర్శకుడిమీద ప్రేమ

సాదాసీదా హీరోల్ని కూడా ఓ రేంజులో చూపించడం, అసలు అప్పటివరకూ ఓ స్టయిల్‌ అంటూ లేని హీరోలకు ప్రత్యేక స్టయిల్‌ని ఇవ్వడం దర్శకుడు పూరి జగన్‌ స్పెషాలిటీ. ప్రిన్స్‌ మేహేష్‌ని ఒక్క ‘పోకిరి’తోనే పీక్‌లెవల్‌కి తీసుకెళ్లాడు. అంతకుముందు ‘ఒక్కడు’ లాంటి హిట్‌ కొట్టినా..మహేష్‌కి తనకంటూ ఓ రేంజ్‌ను, ఇమేజ్‌ను, స్టయిల్‌ను ఇచ్చింది ‘పోకిరి’. అలాగే బన్ని ‘ఆర్య’ వంటి హిట్‌తో ఉన్నా ‘దేశముదురు’తోనే బన్నీకి మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ వచ్చింది. చరణ్‌ని ఆరంభమే ‘చిరుత’గా సూపర్‌స్టైల్‌లో చూపించాడు. ప్రభాస్‌ని ‘బుజ్జిగాడు’గా డిఫరెంట్‌గా ఆవిష్కరించాడు. ముదురువయసు హీరో రవితేజను కూడా ‘ఇడియట్‌’లో హుషారైన కుర్రాడిగా చూపించిందీ పూరీనే.

అయితే పూరీ కెరీర్‌లో పెద్దగా హిట్లు పడకపోయినా..హీరోలకు రేంజ్‌నిచ్చిన క్రెడిట్‌ మాత్రం అతడిదే. అందుకే ఏ హీరో అయినా తమ కెరీర్‌ పదేళ్ల పాటు కొనసాగాలంటే పూరి దర్శకత్వంలో నటించాల్సిందే అనుకుంటున్నారు. బన్ని కూడా తనకి ‘ఇద్దరమ్మాయిలతో’ లాంటి యావరేజ్‌ సినిమానిచ్చినా..వెంటనే మళ్లీ పూరితో నటించడానికి ఓకే చేశాడట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు