క్రిష్‌ తీసింది మొత్తం స్క్రాప్‌ చేసేస్తోంది

క్రిష్‌ తీసింది మొత్తం స్క్రాప్‌ చేసేస్తోంది

కంగనా రనౌత్‌తో పడకపోవడం వల్లే 'మణికర్ణిక' చిత్రం నుంచి క్రిష్‌ వైదొలిగాడు. ఈ సంగతి అతను డైరెక్టుగా చెప్పకపోయినా ఇంకా షూటింగ్‌ మిగిలి వుండగానే 'ఎన్టీఆర్‌' చిత్రాన్ని అతను టేకప్‌ చేసాడంటేనే అర్థం చేసుకోవాలి. క్రిష్‌తో కంగనకి చాలా విషయాల్లో అభిప్రాయబేధాలు వచ్చాయట. అయినా కానీ అలాగే షూటింగ్‌ చేసేసారట. కానీ ఒక స్టేజ్‌కి వచ్చిన తర్వాత క్రిష్‌ వాకౌట్‌ చేసాడని, అక్కడ్నుంచి బ్యాలెన్స్‌ షూటింగ్‌ కంగన దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారని టాక్‌.

ఇంతవరకు బాగానే వున్నా ఇప్పుడు ఈగోకి పోతున్న కంగన క్రిష్‌ తీసిన సన్నివేశాలని తొలగించేస్తోందట. సోనూ సూద్‌పై క్రిష్‌ తీసిన మల్లయుద్ధం సన్నివేశాలని తొలగించడం వల్లే సూద్‌ కూడా అలిగి వెళ్లిపోయాడని చెప్పుకున్నారు. తాజాగా క్రిష్‌ తీసిన సీన్లలో నలభై మూడు రోజులకి చెందిన వర్క్‌ని కంగన కట్‌ చేసేసిందట.

ఇప్పుడు దానిని రీషూట్‌ చేస్తున్నారట. దీని వల్ల నిర్మాతలకి తీవ్రమైన నష్టం అయినా కానీ కంగనకి ఎదురు చెప్పలేక వారు కిక్కురుమనడం లేదట. మొత్తానికి ఈ చిత్రంపై క్రిష్‌ ముద్ర సాంతం చెరిపేసి తనదే సినిమా అనిపించుకోవాలని కంగన చూస్తున్నట్టుంది. ఫైనల్‌గా సినిమా విడుదలయ్యే సరికి దర్శకుడిగా క్రిష్‌ పేరు వుంటుందనేది కూడా అనుమానమే అంటున్నారు కంగన తీరు తెలిసిన వాళ్లు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు