మరో కొత్త కరోనా వేరియంట్.. మూ(mu)..!

కరోనా మహమ్మారి కి అంతం లేకుండా పోతోంది. రోజుకో కొత్త వేరియంట్ పుట్టుకొస్తోంది. c.1.2 గా పిలిచే ఓ వేరియంట్ ఇటీవల వెలుగులోకి రాగా.. తాజాగా మరో కొత్త వేరియంట్ బయటపడింది. తాజాగా.. ‘మా’(mu) వేరియంట్ ని గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ వెల్లడించడం గమనార్హం.

ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఈ వేరియంట్ బయటపడినట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ మూను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్ గా గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య శాఖ తెలపింది. అయితే.. ఈ వేరియంట్ కు టీకాలు కూడా పనిచేయవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాగా.. ఈ కరోనా వైరస్ గతేడాది మన జీవితాల్లోకి రాగా.. అప్పటి నుంచి అది రూపాలను మార్చుకుంటూనే ఉంది. ఇప్పటికే డెల్టా వంటి కొత్త వేరియంట్లతో ఆయా దేశాల్లో విజృంభణ కొనసాగిస్తూనే ఉంది. ఇదే సమయంలో వైరస్ సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్న c.1.2 గా పిలిచే మరో వేరియంట్ బయటపడింది. తాజాగా వ్యాక్సిన్ల నుంచి తప్పించుకునే ‘ మూ’ వేరియంట్ వెలుగులోకి రావడం అందరినీ కలవర పెడుతోంది.

ఇదిలా ఉండగా.. కరోనా మహమ్మారి నిబంధనల నుంచి ఇప్పుడిప్పుడే.. దేశంలో సడలింపులు చేస్తున్నారు. దీంతో.. ఈ మహమ్మారి మళ్లీ విజృంభించడం మొదలుపెట్టడం గమనార్హం.