విజయ్ మాల్యా విల్లా వేలం.. చాలా చీప్ గా అమ్మేశారు!

విజయ్ మాల్యా.. ఈ పేరుకి పరిచయం అక్కర్లేదేమో. బ్యాంకుల్లో రూ.9వేల కోట్లకు పైగా కుచ్చుటోపి పెట్టి.. విదేశాల్లో దాక్కున్న ఈ కింగ్ ఫిషర్ అధినేత కు ఇప్పుడు ఊహించని షాకింగ్ తగిలింది. విజయ్‌ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోని దేశంలోని పలు ప్రాంతాల్లో వున్న ఆయన ఆస్తులను ఒక్కొక్కటిగా వేలం వేస్తున్నాయి.

ఈ నేపథ్యంలోని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గర్లోని విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్‌ ఫిషర్‌ హౌజ్‌ను బ్యాంకులు వేలం వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ బేస్‌ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా కథనాన్ని ప్రచురించింది.

వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలంలో వుంచింది. అయితే దీని ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో అప్పట్లో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలుమార్లు బ్యాంకులు వేలానికి ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు చేసేది లేక ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది.