US సెక్స్ రాకెట్.. ఆమెకు కోపమొచ్చింది

US సెక్స్ రాకెట్.. ఆమెకు కోపమొచ్చింది

మొత్తానికి టీవీ ఛానళ్లకు మరో సరుకు దొరికింది. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తూ.. గంటలు గంటలు ప్రోగ్రామ్స్ నడపడం శాటిలైట్ ఛానల్స్ కు బాగానే అలవాటు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఒకటే టాపిక్ పై రోజుల కొద్దీ లైవ్ లు నడిపిన సందర్భాలు కూడా చూశాం. కానీ ఆ మధ్యన ఓ స్టార్ పవర్ దెబ్బకి.. వీటికి కాసింత బ్రేక్ పడ్డ సంగతి ఒప్పుకోవాలి.

ఇప్పుడు చికాగో సెక్స్ రాకెట్ అంశం సెన్సేషన్ కావడంతో.. దాన్ని హైలైట్ చేసుకుంటూ కథనాలు వండి వారించే కార్యక్రమం మొదలైంది. ఆయా హీరోయిన్స్ ను కానీ.. విక్టిమ్స్ ను కానీ ఇంటర్వ్యూ చేసి వారి వెర్షన్ ను టెలికాస్ట్ చేసేందుకు ముందే.. ఇండస్ట్రీలో ఎవరు దొరికితే వారికి ఫోన్ చేసేసి.. దీని గురించి మీరేం అనుకుంటున్నారు అంటూ సాగదీయడం అనే ఎపిసోడ్ ప్రస్తుతం నడుస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకూ హీరోయిన్ గా నటించిన అర్చన అలియాస్ వేదను ఇలాగే ఓ ఛానల్ ఫోన్ఇన్ ద్వారా అభిప్రాయం అడిగింది.

ఎవరూ ఎవరినీ విక్టిమ్ గా చేయరని.. డబ్బుల కోసం ఇలాంటివి చేసే వారి కారణంగా ఇండస్ట్రీ మొత్తాన్ని అనడం కరెక్ట్ కాదని ఆమె చెప్పుకొచ్చింది. అయితే.. అందరినీ ఒకే గాటన కట్టడం కరెక్ట్ కాదని అర్చన కాస్త కోపగించుకోవడం ఆలస్యం.. ఆమె మాటలను తుంచేసి.. అదే టాపిక్ ను అదే ప్రశ్నను మరో యాంగిల్ లో ఆ యాంకర్ సంధించడం ఆశ్చర్యం కలిగిస్తుంది. గతంలో మీరు కూడా అమెరికా వెళ్లారు కదా అని అర్చనను అడగడం.. మీకు ఇలాంటివి ఎదురయ్యాయా అని ఆమెను ప్రశ్నించడం చూస్తే.. ఇది ఫోన్ఇన్ మాదిరిగా కాకుండా.. అర్చనను ఇంటరాగేషన్ కోసం లైన్ లోకి తీసుకుంటున్నట్లుగా అనిపించక మానదు.