ధర్మాన నిర్ణయం తీసేసుకున్నట్లేనా ?

జగన్మోహన్ రెడ్డి పై అలకో లేకపోతే వారసుడి కోసం తాను సైడైపోవాలని అనుకున్నారో తెలీదు కానీ శ్రీకాకుళం జిల్లాలోని సీనియర్ నేతల్లో ఒకరైన ధర్మాన ప్రసాదరావు కొంతకాలంగా కామ్ గా ఉంటున్నారు. ప్రసాదరావు కొడుకు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు తండ్రి తరపున మొత్తం రాజకీయమంతా చక్కబెట్టేస్తున్నారు.

నియెజకవర్గంలో ప్రధానంగా శ్రీకాకుళం మున్సిపల్ పరిధిలో కొడుకే సుడిగాలి లాగ పర్యటనలు చేసేస్తున్నారు. శభ, అశుభ కార్యక్రమాలు, కార్యకర్తల పరామర్శ, పార్టీ కార్యక్రమాలు ఇలా ఏ అవసరమైనా మొత్తం వారసుడే చక్కబెట్టేస్తున్నారట. రామ్మోహన్ స్పీడు చూసిన తర్వాత ప్రసాదరావు రాజకీయాల నుండి తప్పుకున్నారనే చర్చ చాలా జోరుగా జరుగుతోందట. ఇక ప్రసాదరావు యాంగిల్లో చూస్తే 2019లో గెలవగానే తనకే మంత్రి పదవి డిసైడ్ అయిపోయారట.

నిజానికి ధర్మాన సోదరులు ప్రసాదరావు, కృష్ణదాస్ ఇద్దరు గెలవగానే ఎవరికి మంత్రి పదవి కావాలో వాళ్ళనే తేల్చుకోమని జగన్ చాయిస్ ఇచ్చారట. అన్న కోసం మంత్రి పదవిని త్యాగం చేయాలని తమ్ముడు కూడా అనుకున్నారట. ఇదే విషయాన్ని జగన్ కు సోదరులిద్దరు చెప్పారట. అయితే జగన్ మాత్రం ఊహించని విధంగా కృష్ణదాసునే మంత్రివర్గంలోకి తీసుకుంటానని స్పష్టంగా చెప్పేశారట.

ఇంతకీ విషయం ఏమిటంటే సోదరులిద్దరు మాట్లాడుకుని జగన్ కు తమ ఛాయిస్ చెప్పేలోగా శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన దువ్వాడ శ్రీనివాస్ ఎంటరయ్యారట. టీడీపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు మీద దువ్వాడ పోటీచేసి సుమారు 7 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తన ఓటమికి ప్రసాదరావు సహకరించకపోవటమే కారణమని దువ్వాడ సీఎంతో కంప్లైంట్ చేశారని పార్టీ వర్గాల సమాచారం. జగన్ కు దువ్వాడ చాలా సన్నిహితుడు కావటంతో ఆయన చేసిన ఫిర్యాదును జగన్ నమ్మినట్లు ప్రచారంలో ఉంది.

ఈ కారణం వల్లే ప్రసాదరావుకు బదులు కృష్ణాదాసునే మంత్రివర్గంలోకి తీసుకోవాలని జగన్ డిసైడ్ అయిపోయారట. సో పార్టీలో అప్పట్లో జరిగిన ప్రచారం కారణంగా తనకు మంత్రివర్గంలో చోటు దొరకదని ప్రసాదరావు కన్ఫర్మ్ అయిపోయారట. కాబట్టి రాజకీయాల నుండి రైటర్ అయిపోయి పగ్గాలను వారసుడు రామ్మనోహర్ నాయుడు అప్పగించటమే మేలని డిసైడ్ అయిపోయారట.

ఇదే సమయంలో తొందరలో జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా వారసుడి కోసం ప్రసాదరావు ప్రయత్నిన్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే దీనికి అవకాశం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే తండ్రి ఎంఎల్ఏ, బాబాయ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా మళ్ళీ రామ్మనోహర్ నాయుడుకు జగన్ మేయర్ పదవి ఇస్తారా ? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా ప్రసాదరావైతే రిటైర్మెంట్ నిర్ణయం తీసేసుకున్నట్లే అనంటున్నారు.