కీర్తి తేల్చి చెప్పేసింది

కీర్తి తేల్చి చెప్పేసింది

మహానటి సావిత్రి పాత్రకు కీర్తి సురేష్‌ను ఎంచుకున్నట్లు వార్తలు బయటికొచ్చినపుడు ఆమె ఈ పాత్రకు న్యాయం చేయగలదా అని చాలామంది సందేహించారు. అంతకుముందు వరకు కీర్తి గొప్ప నటిగా ఏమీ పేరు తెచ్చుకోకపోవడమే అందుక్కారణం. ఐతే తనపై నెలకొన్న సందేహాలన్నింటినీ పటాపంచలు చేస్తూ అద్భుత అభినయంతో ఆకట్టుకుంది కీర్తి.

మున్ముందు ఆమె ఎలాంటి సినిమాలు చేస్తుందో ఏమో కానీ.. ఈ సినిమా అయితే ఆమె కెరీర్లో ఒక మైలురాయిలాగా నిలిచిపోవడం ఖాయం అని చెప్పొచ్చు. ‘మహానటి’ చూశాక ఆమె నుంచి ఇలాంటి ప్రత్యేకమైన పాత్రల్ని జనాలు ఆశించడంలో ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ కోలీవు్డలో జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కించాలనుకున్న సినిమాకు కీర్తిన అడిగారు కూడా. కానీ ఆమె మాత్రం ఆ సినిమా చేయడానికి అంగీకరించలేదు.

ఇలాంటి పాత్రలతో తన దగ్గరికి వచ్చేవాళ్లకు ఒక సంకేతం ఇవ్వాలనుకుందో ఏమో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆశ్చర్యకరమైన వ్యాఖ్య చేసింది కీర్తి. ‘మహానటి’ తర్వాత కేవలం తాను పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ సినిమాలే చేయాలనే ఆలోచనతో లేనని.. శుభ్రంగా కమర్షియల్ సినిమాలు చేస్తానని ఆమె తేల్చి చెప్పేసింది. తనకు ఏదైనా పాత్ర నచ్చినపుడు అంగీకరిస్తా కానీ.. కేవలం ట్రెడిషనల్ క్యారెక్టర్లే చేయాలి.. పెర్ఫామెన్స్ కోసమే చూడాలనే ఉద్దేశాలేమీ తనకు లేవనేసింది.

కాబట్టి ఇకపైనా తనను కమర్షియల్ సినిమాలకు కన్సిడర్ చేయాలనే సంకేతాల్ని దర్శకులకు ఇచ్చింది కీర్తి. ప్రస్తుతం తమిళంలో ‘సామి-2’తో పాటు విజయ్ హీరోగా ఎ.ఆర్.మురుగదాస్ రూపొందిస్తున్న క్రేజీ ప్రాజెక్టులోనూ కీర్తి నటిస్తోంది. తెలుగులోనే తన తర్వాతి సినిమా ఏంటో కీర్తి ఇంకా తేల్చుకోలేదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు