#RRR హీరోలకూ పూజలు అందుతాయా?

#RRR హీరోలకూ పూజలు అందుతాయా?

రాజమౌళి సినిమా అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందంటే.. అందుకు కారణం కచ్చితంగా బాహుబలి. మనకు దర్శకధీరుడి సత్తా ముందే తెలుసు కానీ.. బాహుబలి సిరీస్ పుణ్యమా అని.. ఈ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. బాహుబలి.. భల్లాల దేవ వంటి పాత్రలకు పలు ప్రాంతాల్లో పూజలు కూడా చేసేస్తున్నారు.

మన దేశంలో మాత్రమే కాదు.. జపాన్ లో కూడా వీరికి పూజలు జరిగిపోతున్నాయి. బాహుబలి రూపంలో ఉన్న ప్రభాస్ విగ్రహాలు కూడా వచ్చేశాయి. మరి ఇకపై రాజమౌళి సినిమాలో నటించే ఇతర పాత్రధారులకు ఇలాంటి పూజలు జరుగుతాయా.. వారికూడా ఇలాంటివాటికి నోచుకుంటారా అంటే.. కచ్చితంగా అవుననో కాదనో చెప్పడం కష్టమే. ఇందుకు రాజమౌళి అనుసరించే వ్యూహాలే కారణంగా నిలుస్తాయి.

#RRR అంటూ రామ్ చరణ్.. ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ తీస్తాడని.. భారీ బడ్జెట్ అని తప్ప ఇప్పటివరకూ మరో సంగతి ఏదీ.. మేకర్స్ నుంచి బయటకు రాలేదు. పదేళ్లకు పూర్వం మగధీర తీసినపుడు రాజమౌళిపై అంచనాలు పెరిగిపోయాయి. వీటిని తన తర్వాతి సినిమాతో అందుకోవడం కష్టం అని ఫిక్స్ అయిన జక్కన్న.. చాలా తెలివిగా సునీల్ తో సినిమా తీసి.. ఆడియన్స్ అంచనాలను ముందుగానే తగ్గించేశాడు. ఇప్పుడు మళ్లీ తననుంచి బాహుబలి లాంటి ఎక్స్ పెక్ట్ చేయవద్దని చెప్పడానికి సంకేతంగానే.. తెలుగు సినిమాకు బాగా అచ్చొచ్చిన కమర్షియల్ ప్లాట్ తో మూవీ చేసేందుకు రెడీ అయ్యాడనే టాక్ కూడా వినిపిస్తోంది.

మరి ఇదే నిజం అయితే మాత్రం.. ప్రభాస్-రానాలు అందుకున్న మాదిరిగా పూజలు-పునస్కారాలు వంటివి ఎన్టీఆర్-రామ్ చరణ్ లకు దక్కకపోవచ్చు. చూద్దాం.. ఈ యువ హీరోలు క్యారక్టర్లు ఈ సినిమాలో ఎలా ఉంటాయో.. అవి ఏం చేస్తాయో.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు