ఫీల్డులో లేకపోయినా భలే కొట్టారు

ఫీల్డులో లేకపోయినా భలే కొట్టారు

అశ్వనీదత్‌ అనే పేరుకి తెలుగు సినీ పరిశ్రమలో చెరిగిపోని స్థానముంది. నిర్మాతల్లో మెగాస్టార్‌గా ఎదిగిన ఆయన వరుస వైఫల్యాలతో ఫీల్డుకి దూరమయ్యారు. శక్తి ఘోర పరాజయం తర్వాత ఆయన జాతక రీత్యా ఫీల్డుకి దూరంగా వున్నారు. మధ్యలో ఆయన పిల్లలు కొన్ని సినిమాలు తీసినా ఆయన మాత్రం నిర్మాణం జోలికి రాలేదు. బాణం, ఓం శాంతి, ఎవడే సుబ్రమణ్యం చిత్రాలకి నిర్మాణంలో అసలు ఇన్‌వాల్వ్‌ అవ్వని అశ్వనీదత్‌ 'మహానటి'కి కూడా ఎలాంటి క్రియేటివ్‌ డెసిషన్‌ తీసుకోలేదు.

నిజానికి సావిత్రి కథతో సినిమా అంటే ఆయన కాస్త తటపటాయించారట. అయితే ఈ చిత్రం స్థాయి ఏమిటనేది ఆయన ముందుగా గుర్తించారు. అందుకే దీనికి ఎక్కడ్నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా అమ్మనివ్వలేదు. ఈ చిత్రాన్ని సొంతంగా విడుదల చేద్దామని, పెట్టుబడి ఎటూ పోదని, లాభాలు వస్తే మాత్రం భారీగా వుంటాయని అన్నారట. ఇరవై కోట్లు రిస్క్‌ చేయడానికి అశ్వనీదత్‌ సిద్ధపడుతుంటే పిల్లలు భయపడిపోయారట.

అయితే ఆయన మాత్రం ఈ చిత్రం రేంజిని పసిగట్టారు. ఇప్పుడీ చిత్రానికి శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులతోనే పెట్టుబడి వసూలు కాగా, థియేటర్ల నుంచి ముప్పయ్‌ అయిదు కోట్ల షేర్‌ తక్కువ రాదని అంటున్నారు. అన్నీ కలుపుకుని ఈ చిత్రంపై కనీసం ముప్పయ్‌ కోట్ల పైగానే లాభం చూడబోతున్నారు. ఏడేళ్ల పాటు నిర్మాణానికి దూరంగా వున్నా కానీ ఒక సినిమా స్థాయిని ముందుగా కనిపెట్టిన అశ్వనీదత్‌ని అంతా అభినందిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు