డిజప్పాయింట్ అవ్వాల్సిందే -కీర్తి సురేష్

డిజప్పాయింట్ అవ్వాల్సిందే -కీర్తి సురేష్

మహానటి అంటూ సావిత్రి జీవిత కథను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించినపుడు.. అంత పెద్దగా ఆసక్తి ఏమీ కలగలేదు. కానీ సావిత్రి ప్రమోషనల్ మెటీరియల్ రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాక.. కథ మారిపోయింది. సినిమాపై హైప్ మాత్రమే కాదు.. ఆసక్తి కూడా పెరిగిపోయింది. అందుకు తగినట్లుగానే సినిమా కూడా ఉండడంతో ఇరగదీసేసి ఆడేస్తోంది.

ఈ సినిమాలో చెప్పుకోవాల్సిన అసలు సిసలైన విషయం కీర్తి సురేష్ యాక్టింగ్. సావిత్రి దిగొచ్చేసి.. కీర్తి సురేష్ లో లీనం అయిపోయిందా అనిపించే రేంజ్ లో యాక్ట్ చేసి మెప్పిచేసింది. ఈ మలయాళీ కుట్టి మంచి యాక్ట్రెస్ అనే విషయం అందరికీ తెలుసు కానీ.. మరీ ఈ రేంజ్ లో ఇరగదీసేస్తుందని ఎవరూ అనుకోలేదు. ఇంతగా సక్సెస్ సాధించి.. పేరు తెచ్చుకున్న తర్వాత.. కీర్తి సురేష్ తర్వాతి సినిమాలపై ఇంట్రెస్ట్ తో పాటు.. అంచనాలు కూడా ఎక్కువ అయిపోవడంలో సహజం.

ఈ విషయాన్ని కీర్తి ముందే గ్రహించేసింది. తను ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ మహానటికి ముందే ఒప్పుకున్నవే అంటోంది కీర్తి. 'శాండాకోజి2'(పందెం కోడి2).. 'సామి2'..(సామి అంటే లక్ష్మీ నరసింహా).. 'దళపతి 62' సినిమాలు చేస్తున్నట్లు చెప్పింది కీర్తి. ఈ మూడు సినిమాల్లోను తన కంటే హీరో పాత్రకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందని చెప్పిన కీర్తి.. మహానటి రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ చేసుకుని థియేటర్లకు వస్తే మాత్రం.. తదుపరి సినిమాలన్నీ డిజప్పాయింట్ చేస్తాయని అంటోంది.

కాకపోతే.. ఇకపై తాను ఒప్పుకునే సినిమాలు మాత్రం.. తన పాత్రకు కూడా ఇంపార్టెన్స్ ఉండేలా జాగ్రత్త పడతానని చెప్పింది ఈ భామ. అంటే వచ్చే సినిమాల్లో కీర్తి చేసే రోల్స్ అన్నీ బుస్కీయే అనమాట. అదే మన రొటీన్ ఫార్ములాలో రోటి పచ్చడి రకాలు. కానివ్వండి!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు