#RRR పై రామ్ చరణ్ క్లారిటీ

#RRR పై రామ్ చరణ్ క్లారిటీ

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ లు హీరోలుగా #RRR రూపొందుతున్న విషయం.. అధికారికం అయిపోయి చాలారోజులే అయింది. అయితే.. ఈ ప్రాజెక్టు ప్రారంభం కావడానికి మరికొన్ని నెలలు పడుతుంది. ఈలోగా స్క్రిప్టుతో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రంపై ముందు నుంచి చాలా రకాల కథనాలు వినిపించాయి.

ముఖ్యంగా కథ విషయంలో ఎక్కువగా వినిపించిన మాట ఒకటి ఉంది. బాక్సింగ్ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతుందని ఎక్కువగా ప్రచారం జరిగింది. ఈ అంశంపై ఇప్పుడు మెగా పవర్ స్టార్ క్లారిటీ ఇచ్చేశాడు. బాక్సింగ్ థీమ్ పై సినిమా అన్నది ఒట్టి పుకారు మాత్రమే అని తేల్చేశాడు. ఈ సినిమాకు బాక్సింగ్ కు సంబంధమే ఉండదని చెప్పిన చెర్రీ.. థీమ్ ఏంటో ఇప్పుడు చెప్పబోమని అన్నాడు. కచ్చితంగా ఓ థీమ్ ఆధారంగానే మూవీ ఉంటుందని.. అది బాక్సింగ్ మాత్రం కాదని అంటున్నాడు రామ్ చరణ్.

ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందే సినిమాపై దృష్టి పెట్టిన చెర్రీ.. ఆ సినిమాను దసరా నాటికి బరిలోకి తెచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు. ఇక ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ మూవీని రీసెంట్ గానే స్టార్ట్ చేశాడు. ఇది కూడా దసరా లేదా దీపావళి సమయానికే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ ఇధ్దరు స్టార్ హీరోలు తమ ప్రస్తుత కమిట్మెంట్స్ పూర్తి చేసుకుని.. రాజమౌళి మూవీకి పూర్తి సమయం కేటాయించబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు