సీఎం పదవి పోయే.. గవర్నర్ పదవి వచ్చే..?

కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి యడ్యూరప్ప రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే. పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఆయన సీఎం పదవి చేపట్టిన రెండేళ్లకే.. ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అందుకే.. రాజీనామా చేసే సమయంలో ఆయన బాగా ఎమోషనల్ కూడా అయ్యారు.

అయితే.. సీఎం పదవి నుంచి తప్పించినా.. ఆయనకు మరో కీలక పదవి ఇవ్వాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఎన్నో ఏళ్లుగా బీజేపీకి సేవ చేసిన యడియూరప్పను సమున్నత రీతిలో గౌరవించాలని భావిస్తున్నారట బీజేపీ పెద్దలు. ఆంధ్రప్రదేశ్ కి గానీ.. మరో రాష్ట్రానికి గానీ ఆయన్ను గవర్నర్ గా నియమించాలని భావిస్తున్నట్లు సమాచారం.

నిజానికి యడియూరప్ప హుందాగా ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్నాడనే చెప్పాలి. ఢిల్లీ నుంచి కబురు రాగానే.. వెళ్లి చర్చలు జరిపి రాగానే రాజీనామా చేశారు. అందుకు ప్రతిఫలంగా ఆయన్ను గవర్నర్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. ఈ గవర్నర్ పదవి అప్పగించే వార్త కూడా.. మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించాలని అనుకుంటున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.