స్టార్ హీరోలు రాయలసీమ నేపథ్యంలో సినిమా తీస్తే జనాల్లో భలే ఆసక్తి ఉంటుంది. 90ల చివర్లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండు మొదలైనపుడు స్టార్ హీరోలందరూ వరుసబెట్టి ఆ నేపథ్యంలోనే సినిమాలు తీశారు. కానీ ఆ ట్రెండుకు తెరపడ్డాక మళ్లీ నేపథ్యాలు మార్చారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ఆరంభంలోనే రాయలసీమ నేపథ్యంలో ‘ఆది’.. ‘సాంబ’ లాంటి సినిమాల్లో నటించాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత అతను సీమ బ్యాక్ డ్రాప్లో సినిమా చేస్తున్నట్లు సమాచారం. త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ఆ నేపథ్యంలోనే తెరకెక్కుతోందట. ఈ చిత్ర షూటింగ్ కొన్ని రోజుల కిందటే మొదలైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో వేసిన ఓ సెట్లో షూటింగ్ జరుగుతోంది. అది రాయలసీమ వాతావరణాన్ని తలపించే ఒక ఇంటి సెట్ అని సమాచారం. దీన్ని బట్టే సినిమా సీమ నేపథ్యంలో తెరకెక్కుతోందని చెబుతున్నారు. ప్రథమార్ధంలో సరదాగా సాగిపోయే ఈ చిత్రం ఇంటర్వెల్ దగ్గర మలుపు తీసుకుంటుందని.. యాక్షన్ ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అంటున్నారు. కథ కొంచెం పాత స్టయిల్లోనే ఉన్నా.. త్రివిక్రమ్ మార్కు వినోదం దీనికి ఆకర్షణ అవుతుందని చిత్ర బృందం చెబుతోంది. ‘జులాయి’ దగ్గర్నుంచి త్రివిక్రమ్‌తో వరుసగా సినిమాలు నిర్మిస్తున్న ఎస్.రాధాకృష్ణే ఈ చిత్రాన్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన చివరి సినిమా ‘అజ్ఞాతవాసి’ భారీ డిజాస్టర్ అయిన నేపథ్యంలో ఈ చిత్రం విజయవంతం కావడం వారికి అత్యావశ్యకం.
ఎన్టీఆర్ సినిమా.. సీమ నేపథ్యంలో?
Apr 17, 2018
126 Shares
రాజకీయ వార్తలు
-
చంద్రబాబు విజన్ కు టోనీ బ్లెయిర్ ఫిదా!
Apr 20,2018
126 Shares
-
పవన్ కళ్యాణ్ ను తెచ్చినంత వీజీ కాదు
Apr 20,2018
126 Shares
-
ఫర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!
Apr 19,2018
126 Shares
-
బాబు దీక్షకు సినీ మద్దతు
Apr 19,2018
126 Shares
-
ఆయన అడ్డురాకపోతే..హరిబాబుకే మంత్రి పదవి
Apr 19,2018
126 Shares
-
సీఎంపై ఫేస్బుక్లో పోస్ట్..వ్యక్తి అరెస్ట్ !
Apr 19,2018
126 Shares
సినిమా వార్తలు
-
నాని మూడేళ్లు వెనక్కెళ్లాడు
Apr 20,2018
126 Shares
-
ఒక్క దర్శకుడు.. 66 వేల కోట్ల కలెక్షన్లు
Apr 20,2018
126 Shares
-
విక్రమ్ వేద రీమేక్‌లో ఆ సూపర్ స్టార్
Apr 20,2018
126 Shares
-
‘స్పైడర్’లో ఏం తప్పు జరిగిందో చెప్పిన మహేష్
Apr 20,2018
126 Shares
-
నెల కిందటే వర్మను అలా పొగిడి...
Apr 20,2018
126 Shares
-
వర్మ డైరక్షన్లో మళ్ళీ ఫ్లాపే.. ఛ!!
Apr 20,2018
126 Shares