కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో రోజుకో పేరు బయటికి వస్తోంది. తాజాగా రాజశేఖర్-జీవితల గురించి మహిళా సంఘం నేత సంధ్య చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రాజశేఖర్ కోసం ఆయన భార్య జీవితే స్వయంగే పేద అమ్మాయిలకు వల వేసి ఆయన దగ్గరికి పంపించేదంటూ సంధ్య ఓ టీవీ ఛానెల్ చర్చలో చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. వీరి వల్ల ఇబ్బంది పడ్డ ఇద్దరు అమ్మాయిల కేసుల్ని తానే డీల్ చేసినట్లు ఆమె వెల్లడించారు. తెలుగు సినీ పరిశ్రమ చాలా మంచిదని.. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లాంటిదేమీ లేదని జీవిత ఒక టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ పేర్కొనడాన్ని సంధ్య తప్పుబట్టింది.
గతంలో ఒక అమ్మాయిని జీవిత తన భర్త దగ్గరికి పంపడానికి చూసిందని.. ఐతే ఆ అమ్మాయి జ్వరంతో వెళ్లలేకపోవడంతో ఫోన్ చేసి బూతులు తిట్టిందని.. నువ్వ రాకపోతే రాజశేఖర్ దగ్గరికి ఎవరు పోతారంటూ తిట్టి పోసిందని.. ఇది విన్న ఆ అమ్మాయి ఫ్రెండు తనకు విషయం చెప్పిందని.. తాను ఆ అమ్మాయి కోసం పోరాడానని సంధ్య చెప్పింది. ఆ అమ్మాయి చేత ఆంధ్రజ్యోతి పత్రికకు తాను లేఖ రాయిస్తే.. ఆ లేఖను ప్రచురించారు కూడా అని ఆమె వెల్లడించింది. అలాగే మరో అమ్మాయితో కూడా జీవిత ఇలాగే ప్రవర్తించిన ఉదంతం తన దృష్టికి వచ్చిందని సంధ్య వెల్లడించింది. ఇలాంటి మరెన్నో ఉదంతాల గురించి తాను విన్నట్లు ఆమె తెలిపింది. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న జీవిత ఇప్పుడొచ్చి ఇండస్ట్రీ మంచిదని వ్యాఖ్యానించడం హిపోక్రసీనే అని ఆమె అంది. జీవిత లాంటి వాళ్లు కమిటీ అగైన్స్ట్ సెక్సువల్ హరాష్మెంట్ లాంటి వాటిలో సభ్యులుగా ఉంటే ఏం న్యాయం జరుగుతుందని సంధ్య ప్రశ్నించింది. సంధ్య ఈ స్థాయిలో ఆరోపణలు చేసిన నేపథ్యంలో దీనిపై స్పందించాల్సిన బాధ్యత జీవిత-రాజశేఖర్ల మీద ఉంది. ముఖ్యంగా ఏ ఇష్యూ మీదైనా గట్టిగా మాట్లాడే జీవిత ఇప్పుడేమంటుందో చూడాలి.
రాజశేఖర్-జీవిత.. ఏం జవాబిస్తారు?
Apr 17, 2018
126 Shares
రాజకీయ వార్తలు
-
చంద్రబాబు విజన్ కు టోనీ బ్లెయిర్ ఫిదా!
Apr 20,2018
126 Shares
-
పవన్ కళ్యాణ్ ను తెచ్చినంత వీజీ కాదు
Apr 20,2018
126 Shares
-
ఫర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!
Apr 19,2018
126 Shares
-
బాబు దీక్షకు సినీ మద్దతు
Apr 19,2018
126 Shares
-
ఆయన అడ్డురాకపోతే..హరిబాబుకే మంత్రి పదవి
Apr 19,2018
126 Shares
-
సీఎంపై ఫేస్బుక్లో పోస్ట్..వ్యక్తి అరెస్ట్ !
Apr 19,2018
126 Shares
సినిమా వార్తలు
-
నాని మూడేళ్లు వెనక్కెళ్లాడు
Apr 20,2018
126 Shares
-
ఒక్క దర్శకుడు.. 66 వేల కోట్ల కలెక్షన్లు
Apr 20,2018
126 Shares
-
విక్రమ్ వేద రీమేక్‌లో ఆ సూపర్ స్టార్
Apr 20,2018
126 Shares
-
‘స్పైడర్’లో ఏం తప్పు జరిగిందో చెప్పిన మహేష్
Apr 20,2018
126 Shares
-
నెల కిందటే వర్మను అలా పొగిడి...
Apr 20,2018
126 Shares
-
వర్మ డైరక్షన్లో మళ్ళీ ఫ్లాపే.. ఛ!!
Apr 20,2018
126 Shares