సినిమా ఇండస్ట్రీలో కొన్ని సెంటిమెంట్లు వుంటాయి. ఫలానా కాన్సెప్ట్‌తో సినిమా తీస్తే ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనే సెంటిమెంట్ ఒకటి. తెలుగు సినిమాకి సంబంధించి పునర్జన్మ అనే కాన్సెప్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. మూగ మనసులు నుంచి మగధీర మీదుగా మనం వరకు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు ట్రై చేసినా సత్ఫలితాలు వచ్చాయి. ఈ విషయాన్ని గుర్తించాడో లేక కథ కుదిరిందో కానీ కొడుకుని హీరోగా లాంఛ్ చేస్తోన్న పూరి కూడా పునర్జన్మ ఇతివృత్తాన్నే ఎంచుకున్నాడు.
1971 ఇండో పాక్ వార్ నేపథ్యంలో ఒక కథ, సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో ఒక కథ కలిపి 'మెహబూబా' చిత్రానికి పూరి ఒక అద్భుతమైన కథ రాసాడట. రెండు కాలమానాలని కలుపుతూ ఇంటిలిజెంట్ స్క్రీన్‌ప్లే చేసాడని, ఇంతకాలం కథా రచయితగా విఫలమవుతూ వస్తోన్న పూరి ఈసారి మాత్రం పకడ్బందీ కథతో వస్తున్నాడని సమాచారం. ఇండో పాక్ వార్ అంటే ఏదో తూతూ మంత్రంగా కాకుండా వార్ ఎపిసోడ్స్ కళ్లకి కట్టేలా రూపొందించాడట. వార్ నేపథ్యంలో వచ్చిన అనేక హాలీవుడ్ చిత్రాలకి తీసిపోని విధంగా యుద్ధ సన్నివేశాలుంటాయని తెలిసింది.
ఇటీవల విడుదల చేసిన ట్రెయిలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ ఊపుని కంటిన్యూ చేసేలా మరింతగా ప్రమోషన్స్ అదరగొట్టేయాలని పూరి కనక్ట్స్ టీమ్ రంగం సిద్ధం చేసుకుంటోంది. చూడ్డానికి ఇంకా పిల్లాడిలా కనిపిస్తోన్న ఆకాష్ పూరి తన తండ్రి విజన్‌ని ఏమాత్రం ఎలివేట్ చేసాడనేది చూడాలి.
కొడుకు కోసం పకడ్బందీ సెట్టింగ్
Apr 16, 2018
126 Shares
రాజకీయ వార్తలు
-
చంద్రబాబు విజన్ కు టోనీ బ్లెయిర్ ఫిదా!
Apr 20,2018
126 Shares
-
పవన్ కళ్యాణ్ ను తెచ్చినంత వీజీ కాదు
Apr 20,2018
126 Shares
-
ఫర్లేదు.. మోడీని లోకేష్ ఆడుకుంటున్నాడే!
Apr 19,2018
126 Shares
-
బాబు దీక్షకు సినీ మద్దతు
Apr 19,2018
126 Shares
-
ఆయన అడ్డురాకపోతే..హరిబాబుకే మంత్రి పదవి
Apr 19,2018
126 Shares
-
సీఎంపై ఫేస్బుక్లో పోస్ట్..వ్యక్తి అరెస్ట్ !
Apr 19,2018
126 Shares
సినిమా వార్తలు
-
నాని మూడేళ్లు వెనక్కెళ్లాడు
Apr 20,2018
126 Shares
-
ఒక్క దర్శకుడు.. 66 వేల కోట్ల కలెక్షన్లు
Apr 20,2018
126 Shares
-
విక్రమ్ వేద రీమేక్‌లో ఆ సూపర్ స్టార్
Apr 20,2018
126 Shares
-
‘స్పైడర్’లో ఏం తప్పు జరిగిందో చెప్పిన మహేష్
Apr 20,2018
126 Shares
-
నెల కిందటే వర్మను అలా పొగిడి...
Apr 20,2018
126 Shares
-
వర్మ డైరక్షన్లో మళ్ళీ ఫ్లాపే.. ఛ!!
Apr 20,2018
126 Shares