‘నారప్ప’తో రూ.17 కోట్ల లాభం!

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ సినిమాకి రీమేక్ గా ‘నారప్ప’ను తెరకెక్కించారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో వెంకటేష్ హీరోగా నటించారు. సురేష్ బాబు నిర్మించిన ఈ సినిమాను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు. ఒరిజినల్ వెర్షన్ చూడని ప్రేక్షకులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతోంది. ఎమోషనల్ సీన్స్ లో వెంకీ పెర్ఫార్మన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. నిజానికి ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా ఓటీటీకి ఇచ్చేశారు.

అయితే ఈ సినిమా హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ సంస్థ భారీగానే చెల్లించినట్లు తెలుస్తోంది. మొత్తం శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కలిపి ఈ సినిమాకి రూ.40 కోట్ల బిజినెస్ జరిగిందట. సినిమా ప్రొడక్షన్ కాస్ట్, రెమ్యునరేషన్లు తీసేస్తే.. నిర్మాతకు ఈ సినిమాతో రూ.17 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకి పదిహేడు కోట్లు లాభం అంటే మాములు విషయం కాదు. అందుకే సురేష్ బాబు కూడా ఓటీటీ డీల్ కు అంగీకరించినట్లు ఉన్నారు. వెంకీ కూడా ఈ సినిమాకి ఫ్యాన్సీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.

‘నారప్ప’తో భారీ లాభాలు చవిచూసిన సురేష్ బాబు తన తదుపరి సినిమాలను కూడా ఓటీటీలో విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు. ముందుగా ‘దృశ్యం 2’ను విడుదల చేయనున్నారు. దీనికోసం హాట్ స్టార్ సంస్థ భారీ డీల్ ను ఆఫర్ చేసినట్లు సమాచారం. రానా నటించిన ‘విరాటపర్వం’ కూడా ఓటీటీలో వస్తుందని అంటున్నారు. కానీ దర్శకుడి వెర్షన్ మాత్రం వేరేలా ఉంది. మరి ఈ సినిమా విషయంలో సురేష్ బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!