యూకేని వణికిస్తున్న నోరా వైరస్..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఎంతలా వణికించిందో మనందరికీ తెలిసిందే. ఈ మహమ్మారికి వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఆ వైరస్ లో కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చి మనల్ని భయపెడుతున్నాయి. దీనినే తట్టుకోలేకపోతోంటే. తాజాగా యూకేని మరో కొత్త వైరస్ వణికిస్తోంది.

యూకేలో నోరా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నట్లు గుర్తించారు. మే చివరి నుంచి నమోదైన కేసులను లెక్కేస్తే.. 154 నోరా కేసులు బయటపడ్డాయి. రోజురోజుకు ఈ కేసులు పెరుగుతుండడం.. ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు నిపుణులు.

నిజానికి కరోనా మహమ్మారి నుండి యూకే ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇలాంటి సమయంలో నోరా కేసులు పెరుగుతుండడంతో ప్రజల్లో కలవరం మొదలైంది. ఇది కూడా వ్యాపించే స్వభావమున్న వైరస్ కావడంతో భయంతో వణికిపోతున్నారు. నోరో వైరస్ సోకితే.. వాంతులు, వికారం, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా ఉంటాయి.