రిషబ్ పంత్ కి కరోనా ఎలా సోకిందో తెలుసా?

Rishab Pant

టీమిండియాలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ క్రికెటర్ కి కరోనా సోకిందని వార్తలు రాగా.. ఆ క్రికెటర్ రిషబ్ పంత్ గా తెలుస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న పంత్ కి కరోనా ఎలా సోకిందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పంత్ కి కరోనా సోకి దాదాపు వారం రోజులు అవుతోందట. ఈ విషయాన్ని బీసీసీఐ బయటపెట్టలేదు. కానీ.. ఈ విషయాన్ని స్పోర్ట్స్ టాక్ అనే సంస్థ పేరు వెల్ల‌డించింది. క‌రోనా సోకిన భార‌త ఆట‌గాడు రిష‌బ్ పంత్ అని తెలిపింది.

రిష‌బ్ పంత్ ప్ర‌స్తుతం క్వారెంటైన్ లో ఉన్నార‌ని, ల‌క్ష‌ణాలేవీ లేవ‌ని స్పోర్ట్స్ టాక్ వెల్ల‌డించింది. యూరోలో భాగంగా లండ‌న్‌లోని వింబ్లే స్టేడియంలో ఇంగ్లండ్‌, జ‌ర్మ‌నీ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ చూడ‌టానికి పంత్ వెళ్లార‌ని, ఆ స‌మ‌యంలో క‌రోనా సోకి ఉండ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతుంది. ఆ ఒక్క‌సారి మాత్ర‌మే పంత్ బ‌యో బ‌బుల్ నుండి బ‌య‌ట‌కొచ్చిన‌ట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఉపాధ్య‌క్షుడు రాజీవ్ శుక్లా కూడా ఓ ప్లేయ‌ర్‌కు క‌రోనా సోకిన మాట నిజమే అని చెప్పినా.. పేరు బ‌య‌ట‌పెట్ట‌లేదు. 8 రోజులుగా ఐసోలేష‌న్ లో ఉన్నాడ‌ని తెలిపారు. అయితే, మిగ‌తా ప్లేయ‌ర్స్ కు మాత్రం క‌రోనా సోక‌లేద‌ని ధృవీక‌రించారు.