ఓవ‌ర్ నైట్ స్టార్ డ‌మ్ త‌ల‌కెక్క‌లేదు

ఓవ‌ర్ నైట్ స్టార్ డ‌మ్ త‌ల‌కెక్క‌లేదు

కొన్నిసార్లు అంతే.. అదృష్టం అలా త‌న్నుకుంటూ వ‌స్తుంది. వాటిని స‌క్ర‌మంగా వాడుకుంటే.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్న‌ట్లు ఉంటుంది. అదే స‌మ‌యంలో ఏ మాత్రం తేడా చేసినా మొద‌టికే మోసం రావ‌ట‌మే కాదు.. ఎంత గుడ్డో.. అంత బ్యాడ్ అయ్యే ప‌రిస్థితి. ఈ విష‌యాన్ని క‌న్నుగీటు చిన్న‌ది ప్రియా బాగానే గుర్తించిన‌ట్లుంది.

కంప్ పాట‌తో ఒక్క‌సారిగా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ ఆచితూచి అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చిన్న వ‌య‌సులో ఆమె చేసిన ఒక పాట‌కు రాత్రికి రాత్రే భారీ స్టార్ అయిపోయినా.. ఆమె కూల్ గా ఉంటున్నారు. పేరుతో పాటు.. ఫిర్యాదులు రావ‌టంపైనా ఆమె తొంద‌ర‌ప‌డ‌టం లేదు.

పొగిడేవాళ్ల‌ను చూసి మురిసిపోవ‌టం.. విమ‌ర్శించే వాళ్ల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసే తీరుకు భిన్నంగా కూల్ గా ఉంటూ సెటిల్డ్ గా రియాక్ట్ అవుతోంది. తాజాగా త‌న పాట‌పై వ‌స్తున్న కంప్లైంట్ మీద రియాక్ట్ అయిన ఆమె.. ఫిర్యాదుల గురించి త‌న‌కు తెలీద‌ని..ఇలాంటి ఇష్యూస్ మీద  కామ్ గా ఉండ‌ట‌మే మంచిద‌ని చెబుతోంది. పాట‌లోని కొన్ని ప‌దాలు ముస్లింల మ‌నోభావాల్ని కించ‌పరిచేలా ఉన్నాయ‌న్న ఫిర్యాదులురావ‌టం తెలిసిందే.

ఊహించ‌ని పాపులార్టీకి ఎలా రియాక్ట్ కావాలో త‌న‌కు అర్థం కావ‌టం లేద‌ని చెప్పింది. క‌న్నుగీటే సీన్ ను రిహార్స‌ల్స్ చేయ‌కుండానే చేశాన‌ని చెప్పింది. ఏమైనా.. ఇంత స్టార్ డ‌మ్ లోనూ తొంద‌ర‌ప‌డి మాట బ‌య‌ట‌కు రానివ్వ‌ని ప్రియ‌కు బ్రైట్ ఫ్యూచ‌ర్ ఉందంటున్నారు. ఆల్ ద బెస్ట్ ప్రియా.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు