మొత్తానికి బన్నీపై చరణ్‌ పై చేయి!

మొత్తానికి బన్నీపై చరణ్‌ పై చేయి!

ఈమధ్య కాలంలో అల్లు అర్జున్‌ నిలకడ చూపిస్తూ స్టార్‌గా తన స్టేటస్‌ పెంచుకుంటూ పోతే, రామ్‌ చరణ్‌ మాత్రం తనకున్న మినిమం గ్యారెంటీ ట్యాగ్‌ని బ్రూస్‌లీ, గోవిందుడు అందరివాడేలే లాంటి చిత్రాలతో పోగొట్టుకున్నాడు. ధృవ బాగానే ఆడినా కానీ స్టార్‌ హీరోల సినిమాలకి ధీటుగా అయితే ఆడలేదు. అల్లు అర్జున్‌ చిత్రాలకి ఫ్లాప్‌ టాక్‌ వచ్చినా కానీ కలక్షన్ల పరంగా ఢోకా వుండడం లేదు.

ఈ నేపథ్యంలో చిరంజీవి తనయుడు మళ్లీ బౌన్స్‌ బ్యాక్‌ అయి తన సత్తా చాటుకుంటాడని మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు. చరణ్‌, అల్లు అర్జున్‌ల సినిమాలు తక్కువ వ్యవధిలో సమ్మర్‌కి రిలీజ్‌ అవుతూ వుండడంతో ఈసారి అయినా చరణ్‌ అప్పర్‌హ్యాండ్‌ సాధిస్తాడని మెగాస్టార్‌ వారసుడి అభిమానులు కలలు కంటున్నారు. రంగస్థలం, నా పేరు సూర్య చిత్రాల్లో రెండోదే కమర్షియల్‌గా కనిపిస్తున్నా కానీ చరణ్‌ సినిమాలోని వైవిధ్యం ప్రేక్షకుల మనసులని గెలుస్తుందని భావిస్తున్నారు. ప్రమోషన్ల పరంగా రంగస్థలం ప్రస్తుతానికి పైచేయి సాధించింది. ఈ చిత్రానికి సంబంధించిన హీరో హీరోయిన్ల ఇంట్రడక్షన్‌ టీజర్లు కానీ, ఎంత సక్కగున్నావే పాట కానీ ఇన్‌స్టంట్‌గా హిట్‌ అయ్యాయి. మరోవైపు నా పేరు సూర్యలోని రెండు పాటలకి కూడా అల్లు అర్జున్‌ పాటల్లో వుండాల్సిన కిక్కు మిస్‌ అయిందనే టాక్‌ తెచ్చుకున్నాయి.

ఎప్పటిలా దేవి లేదా తమన్‌తో కాకుండా విశాల్‌ శేఖర్‌ని మ్యూజిక్‌ డైరెక్టర్‌గా పెట్టుకోవడంతో బన్నీకి తగిన సాంగ్స్‌ పడినట్టు లేదనిపిస్తోంది. మరోవైపు నా పేరు సూర్య చిత్రంపై అపారమైన నమ్మకంతో దీనిని మహేష్‌ చిత్రం భరత్‌ అనే నేను, రజనీకాంత్‌ కాలాకి ఆపోజిట్‌గా రిలీజ్‌ చేయడానికి సై అంటే సై అంటున్నారు నిర్మాతలు.