సౌండ్‌ లేని కొత్త సినిమాలు

సౌండ్‌ లేని కొత్త సినిమాలు

ప్రతి వారం రెండు కంటే ఎక్కువ సినిమాలు విడుదల కావడం ఈమధ్య రివాజు అయిపోయింది. అయితే విడుదలకి ముందు కాస్త బజ్‌ వున్న సినిమాలకి మాత్రమే ఆదరణ దక్కుతోంది. విడుదలకి ముందు పాజిటివ్‌ వైబ్రేషన్స్‌ క్రియేట్‌ చేయడం, తమ సినిమా కోసం జనం ఎదురు చూసేలా చేయడం ఇప్పుడు అతి పెద్ద ఛాలెంజ్‌. ఈవారం నాని నిర్మించిన 'అ', సందీప్‌ కిషన్‌ నటించిన 'మనసుకు నచ్చింది' రిలీజ్‌ అవుతున్నాయి.

'అ' చిత్రం సోషల్‌ మీడియాలో కాస్త హల్‌చల్‌ చేసినా కానీ విడుదలకి ముందు కావాల్సిన ఆ క్యూరియాసిటీ మాత్రం పుట్టించలేకపోయింది. ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్‌ డల్‌గానే వుంది. ఇక సందీప్‌ కిషన్‌ సినిమాకి మహేష్‌ సోదరి మంజుల దర్శకురాలు అయినా కానీ అంతగా క్రేజ్‌ రాలేదు. ఆల్రెడీ మార్కెట్లో తొలిప్రేమ, ఛలో రూపంలో హిట్‌ సినిమాలున్నాయి. అవి ఇంకా ఫ్రెష్‌గా వుండగానే వస్తోన్న ఈ కొత్త సినిమాలు చాలా మంచి టాక్‌ తెచ్చుకుంటే తప్ప బాక్సాఫీస్‌ని సేఫ్‌గా దాటడం కష్టమవుతుంది.

అక్క కోసం మహేష్‌ స్వయంగా రంగంలోకి దిగి, ప్రమోషనల్‌ ఇంటర్వ్యూ ఒకటి చేసిపెట్టాడు. మరి మహేష్‌ ప్రమోషన్‌ కలిసి వచ్చిన 'మనసుకు నచ్చింది' మినిమమ్‌ ఓపెనింగ్‌ తెచ్చుకుంటుందో లేదో చూడాలి. మరోవైపు 'అ'ని జనాల్లోకి తీసుకెళ్లడానికి నాని కూడా తనకి తెలిసిన ట్రిక్కులు వాడుతున్నాడు. మరి ఈ రెండిట్లో ఏది బాక్సాఫీస్‌ని గెలుస్తుందో చూడాలిక.