సైరా!! నయన్ అండ్ బిగ్ బి రెడీ

సైరా!! నయన్ అండ్ బిగ్ బి రెడీ

సైరా నరసింహా రెడ్డి.. అంటూ మెగాస్టార్ గర్జనలకు అన్నీ సిద్ధమవుతున్నాయి. టాలీవుడ్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల జాబితాలో బాహుబలి తర్వాతి స్థానంలో నిలవనుంది సైరా. మెగాస్టార్ 151గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రకరకాల ఇబ్బందులు తలెత్తాయంటూ గత కొంతకాలంగా వార్తలు వచ్చాయి. సంగీత దర్శకత్వపు బాధ్యతల నుంచి ఏఆర్ రెహమాన్ తప్పుకోవడం.. సినిమాటోగ్రాఫర్ మారిపోవడం వరకూ నిజమే అయినా.. అనేక ఇతర మాటలు కూడా వినిపించాయి.

దర్శకుడు సురేందర్ రెడ్డి పిక్చరైజేషన్ మెగాస్టార్ కు నచ్చలేదని.. అమితాబ్ బచ్చన్ హ్యాండ్ ఇఛ్చారని.. నయనతార నుంచి కాల్షీట్స్ సమస్య వచ్చిందని అనేక మాటలు వినిపించినా.. ఇవన్నీ జస్ట్ రూమర్స్ అని తేల్చేసింది యూనిట్. నిజానికి ఈ అంశాలలో చిన్నపాటి ఇబ్బందులు తలెత్తినా.. నిర్మాత రామ్ చరణ్ రంగంలోకి దిగి పరిష్కరించాడనే టాక్ ఉంది. ఇప్పుడు బాలీవుడ్ మెగాస్టార్ నుంచి డేట్స్ అఢ్జస్ట్ మెంట్ జరిగిపోయిందట. మరోవైపు నయనతార కూడా డేట్స్ ను అలాట్ చేసిందని తెలుస్తోంది. అన్నిటినీ క్రోడీకరించి.. మూవీ షూటింగ్ షెడ్యూల్స్ ఫిక్స్ చేశారట.

తొలి షెడ్యూల్ షూటింగ్ తర్వాత దాదాపు రెండు నెలలు గ్యాప్ తీసుకోగా.. ఇప్పుడు రెండో షెడ్యూల్ షూటింగ్ కు యూనిట్ రెడీ అయిపోతోంది. మెగాస్టార్ చిరంజీవి అమెరికా నుంచి రాగానే షూటింగ్ స్టార్ట్ చేయనున్నాడట సురేందర్ రెడ్డి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు