25 కోట్ల తొలి ప్రేమ

25 కోట్ల తొలి ప్రేమ

మంచి కంటెంట్ ఉన్న సినిమాకు అన్ని అంశాలూ కలిసొస్తే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో చెప్పడానికి ‘తొలి ప్రేమ’ రుజువుగా నిలుస్తోంది. ఫిబ్రవరి అంటే మామూలుగా అన్ సీజన్ అని అంటుంటారు. ఈ నెలలో మంచి టాక్ తెచ్చుకున్న సినిమాలకు కూడా ఆశించిన స్థాయిలో వసూళ్లు ఉండవు. కానీ ‘తొలి ప్రేమ’ మాత్రం మంచి సీజన్లలో మాదిరే అదిరిపోయే వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం నాలుగు రోజుల్లోనే 25 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేయడం విశేషం.

 షేర్ రూ.16 కోట్లకు చేరువగా ఉండటం విశేషం. శనివారం రిలీజైన ఈ చిత్రం తొలి రెండు రోజుల్లో అంచనాల్ని మించి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. సోమవారం కలెక్షన్లు కొంచెం డ్రాప్ అయ్యాయి కానీ.. ఆ రోజు ఆ మాత్రం మామూలే.

ఐతే మంగళవారం శివరాత్రి సెలవు కావడంతో ‘తొలి ప్రేమ’ అదరగొట్టేసింది. పోటీగా వచ్చిన సినిమాలు తుస్సుమనిపించడంతో ‘తొలి ప్రేమ’దే హవా అయింది. నాలుగో రోజు ఈ చిత్రానికి రూ.2.7 కోట్ల దాకా షేర్ వచ్చినట్లు అంచనా. తొలి రోజు వసూళ్లకు చాలా దగ్గరగా ఈ కలెక్షన్లు ఉండటం విశేషం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ.11 కోట్ల దాకా షేర్ రూ.18.5 కోట్ల గ్రాస్ రాబట్టింది. అమెరికాలో ఈ చిత్రం మిలియన్ మార్కు దిశగా అడుగులేస్తోంది.

వీకెండ్లోనే హాఫ్ మిలియన్ మార్కును దాటిన ఈ చిత్రం.. తర్వాతి రెండు రోజుల్లో ఇంకో 2 లక్షల డాలర్లు వసూలు చేసింది. ఈ వీకెండ్లో వచ్చే సినిమాల ఫలితాన్ని బట్టి ఈ చిత్రం మిలియన్ మార్కును దాటుతుందా లేదా అన్నది ఆధారపడి ఉండొచ్చు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే మాత్రం మిలియన్ మార్కు పక్కా అనే అనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు