'మా'కు సపోర్ట్ చేయని హీరోయిన్ ఆమేనా?

'మా'కు సపోర్ట్ చేయని హీరోయిన్ ఆమేనా?

తమకు సపోర్ట్ చేయకపోతే హీరోయిన్లకు తోకలు కత్తిరిస్తామంటూ.. మా అధ్యక్షుడు శివాజిరాజా పెద్ద బాంబ్ నే పేల్చాడు. తెలుగు సినిమాలు చేస్తూ కోట్లు దండుకుంటున్న కొందరు హీరోయిన్లు.. ఆ తర్వాత టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఏమాత్రం సాయం చేయని వారికి పెద్ద హెచ్చరికలనే పంపాడు శివాజీరాజా.

ఇలా తమకు సపోర్ట్ చేయకపోవడాన్ని తప్పు పట్టడంలో తప్పేమీ లేదు కానీ.. అసలు వీరు పిలిస్తే రానన్న హీరోయిన్ ఎవరు? అన్నదే ఆసక్తికరం. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్.. మిల్కీ బ్యూటీ తమన్నా.. వీరిద్దరిని ఉద్దేశించే శివాజి రాజా ఇలాంటి డైలాగ్స్ పేల్చాడనే టాక్ వినిపిస్తోంది. గతంలో జరిగిన ఓ ఈవెంట్ కు సంబంధించి వీరిద్దరినీ అడిగారట. కానీ ఈ భామలిద్దరూ నో అనేశారనే టాక్ వినిపిస్తోంది. అందుకే ఇప్పుడు ముందస్తుగానే ఇలా తోకలు కత్తిరించే డైలాగులు వినిపించాయని అంటున్నారు.

నిజానికి ఈ ఇద్దరు ఏదైనా కూడా డబ్బిస్తేనే చేస్తాను అనడం వారికి అలవాటైపోయింది. కాబట్టి వాళ్లకి పేమెంట్ తీసుకోకుండా చేయాలంటే ఆసక్తి రాలేదు అని రూమర్లు వినిపిస్తున్నాయి. కనీసం సోషల్ మీడియా అప్ డేట్స్ కూడా ఫ్రీగా పెట్టే అలవాటు వీరికి లేదని అంటారు. అందుకే ఇప్పుడు శివాజీరాజా నోటి నుంచి తోకల డైలాగులు రాగానే.. వీరిద్దిరి పేర్లే మొదటగా వినిపిస్తున్నాయి.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు