పిక్ టాక్: ఉపాసన లాక్ చేసేసింది

పిక్ టాక్: ఉపాసన లాక్ చేసేసింది

ప్రపంచంలో ప్రేమ కంటే మధురమైన ఫీలింగ్ మరొకటి లేదు అనేది అందరికి తెలిసిన విషయమే. ప్రేమ అనేది ఒక్క బాయ్ అండ్ గర్ల్ మధ్య ఉండేది కాదు. బ్లడ్ రిలేషన్ లో ఆ ఫీలింగ్ ను మనం రోజు ఆస్వాదిస్తూనే ఉంటాం. ఇక స్పెషల్ గా ఉంటే యువతి యువకుల మధ్య తెలియకుండా పుట్టే ఆ ప్రేమ మాత్రం సరికొత్త అనుభూతుని ఇస్తుంది. పెళ్లైన జంటలు కూడా అదే తరహాలో ప్రేమించుకుంటూ ఉంటారు.

అలాగే ఇప్పుడు మన టాలీవుడ్ లో స్టార్స్ పెళ్లి తరువాత చాలా మంది లవర్స్ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వారిలో మెగా జంట రామ్ చరణ్ - ఉపాసన కూడా ఉన్నారు. చాలా ఉన్నత స్థాయిలో ఉన్న ఈ జంట మధ్య ప్రేమను చుస్తే ఎలాంటి వారైనా వావ్ అనేస్తారు. ఇద్దరు ఎంతో సింపుల్ గా ఉండటానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువగా ఉపాసన తన ప్రేమను తెలియజేస్తూ ఉంటుంది.

ఇక ఈ రోజు ప్రేమికుల రోజు అని అందరికి తెలిసే ఉంటుంది. అయితే ఉపాసన ఒక స్పెషల్ ఫొటోని అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రేమికులకు స్పెషల్ అడ్డాగా చెప్పుకునే ఒక ప్లేస్ లో జంటలు ఒక తాళాన్ని ఓ ఫెన్సింగ్ కు వేస్తారు. అంటే వారి బంధం ఎప్పటికి అలా లాక్ అయ్యి ఉంటుందని నమ్మకం. అదే తరహాలో ఉపాసన కూడా వారి బంధం ఎప్పుడు లవ్ తో లాక్ అయ్యి ఉండాలని ఒక ఫొటో ద్వారా చెప్పేసింది.     

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు