అమెరికాలో మనోడు అదరగొట్టేశాడు.. అక్కడ కాబోయే పోలీస్ బాస్ అతడే

దేశం కాని దేశానికి వెళ్లటం వేరు. అక్కడ అత్యుత్తమ స్థానాలకు ఎంపిక కావటం అరుదైన విషయం. తాజాగా అలాంటి ఉదంతమే తాజాగా చోటు చేసుకుంది. కేరళకు చెందిన ఒక యువకుడు వలస కార్మికుడిగా అమెరికాలో పని చేయటమే కాదు.. కొంతకాలానికి పోలీసు శాఖలో కీలకమైన పోలీస్ బాస్ పదవికి ఎంపిక కావటం సామాన్యమైన విషయం కాదు. అలాంటి అరుదైన ఘనతను సాధించిన వ్యక్తి మరెవరో కాదు.. కేరళ మూలాలు ఉన్న మైఖేల్ కురువిల్లా.

మైఖేల్ కుటుంబం అమెరికాకు వలస వెళ్లింది. చికాగోలోని ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయం నుంచి సోషల్ వర్కులో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. గతంలో కార్మికుడిగా పని చేసిన బ్యాక్ గ్రౌండ్ ఉన్న మైఖేల్.. 2006లో బ్రూక్ షీల్డ్ పోలీస్ శాఖలో చేరారు. ఇందులో పదవిని చేపట్టిన తొలి మొదటి భారతీయ అమెరికన్ అతడే కావటం విశేషం.

ఇదిలా ఉంటే.. తాజాగా ఇల్లినాయిస్ రాష్ట్ర శివారు ప్రాంతమైన బ్రూక్ ఫీల్డ్ తదుపరి పోలీస్ బాస్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం ఈ పదవిలో ఉన్న ఎడ్వర్డ్ పెట్రాక్ సిఫార్సు మేరకు మైఖేల్ నియామకం సాగింది. జులై 12న ఈ పదవిని చేపట్టనున్నారు. వలస కుటుంబ నేపథ్యం ఉన్న తనకు పోలీసు శాఖలో కీలక బాధ్యత అప్పగించటం సామాన్యమైన విషయం కాదన్నారు. తన వంతు కృషి తోనే తానీ స్థాయికి చేరుకున్నట్లుగా వ్యాఖ్యానించారు. ఏమైనా దేశం కాని దేశంలో.. తన సత్తా చాటిన మైఖేల్కు అభినందనలు తెలపాల్సిందే.