మిడ్ నైట్ షోలా.. హహహ!

మిడ్ నైట్ షోలా.. హహహ!

అత్యాశకు పోతే ఇలాగే ఉంటుంది మరి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశాన్నంటాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడం కోసం ఫస్ట్ వీక్ టికెట్ల రేట్లు పెంచేశారు. 24 గంటలూ షోలు నడిపించడానికి వీలుగా రాత్రి 1 గంట నుంచి ఉదయం 10 గంటల వరకు అదనపు షోలు వేయడానికి అనుమతి ఇచ్చారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని మెజారిటీ థియేటర్లను ఈ సినిమాకే కేటాయించారు. ఇలా భారీ వసూళ్లు దండుకోవడానికి చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. కానీ ఏం లాభం..? సినిమాకు మాత్రం పేలవమైన టాక్ వచ్చింది. దీంతో ప్లాన్ తిరగబడింది.

ఇప్పుడు రెగ్యులర్ షోలకే హాళ్లు నిండని పరిస్థితి కనిపిస్తోంది. తొలి రోజు వరకు ఈ అడ్వాంటేజీ బాగానే ఉపయోగపడింది. రెండో రోజు నుంచే అదనపు షోల వల్ల ఏ ప్రయోజనం లేకపోయింది. సాయంత్రం.. రాత్రి షోల పరిస్థితి పర్వాలేదనిపించినా.. మార్నింగ్ షోల పరిస్థితి దయనీయంగా ఉంది. ఇక ఉదయం 8 గంటలకు ఎక్కడ షోలు వేస్తారు. అర్ధరాత్రి తర్వాత షోల గురించైతే చెప్పనక్కర్లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అదనపు రెండు షోల ఊసే లేదు ఎక్కడా.

తెలంగాణలో కూడా ఉదయం 8 గంటల షోలు వేయట్లేదు. ఆ షోలు వేస్తే థియేటర్ల మెయింటైనెన్స్ కూడా వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ అవకాశాన్ని ఎవ్వరూ ఉపయోగించుకోలేదు. ఐతే సినిమాకు మంచి టాక్ వచ్చి ఉంటే మాత్రం ఈ అడ్వాంటేజీ ‘అజ్ఞాతవాసి’కి బాగా ఉపయోగపడేది. రికార్డు స్థాయి వసూళ్లతో ఈ పాటికి నాన్-బాహుబలి రికార్డులు లేచిపోయే పరిస్థితి ఉండేది.
 

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు