బార్డ‌ర్ లో వంట చేసిన ర‌కుల్‌!

బార్డ‌ర్ లో వంట చేసిన ర‌కుల్‌!

సినిమాలో యాక్ట్ చేయ‌టం ఒక ఎత్తు అయితే.. ఆ సినిమాను ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యేలా.. సినిమా మీద ఆస‌క్తి పెంచేలా ప్ర‌మోష‌న్ చేయ‌టం మ‌రో ఎత్తు. ఇటీవ‌ల కాలంలో సినిమా ప్ర‌మోష‌న్ల కోసం భారీగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అందుకోసం వ్య‌య‌ప్ర‌యాస‌ల్ని ప‌ట్టించుకోవ‌టం లేదు.

సైన్యాధికారి అభియాన్ సింగ్.. మేజ‌ర్ జ‌య్ బ‌క్సీల జీవితాల ఆధారంగా బాలీవుడ్ లో అయ్యారీ మూవీని తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్ర ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాన్ని దేశ స‌రిహ‌ద్దుల్లో ఒక‌టైన రాజ‌స్థాన్ లోని జైస‌ల్మేర్  ప్రాంతంలో  నిర్వ‌హించారు. ఈ ప్ర‌మోష‌న్ యాక్టివిటికీ న‌టులు మ‌నోజ్ వాజ‌పేయి.. సిద్ధార్థ మ‌ల్హోత్రా.. ర‌కుల్ ప్రీత్ సింగ్  త‌దిత‌రులు వెళ్లారు.

బీఎస్ఎఫ్ ప‌రిస‌రాల్లో జ‌వాన్ల‌ను క‌లుసుకొని వారితో ముచ్చ‌టించ‌ట‌మే కాదు.. వారితో పాటు బ్యాట్మెంట‌న్ ఆడారు. సాయంత్రం ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌మోష‌న్ టూర్లో వంట చేసుకున్న యూనిట్‌.. ఆ ఫోటోల‌ను షేర్ చేసుకున్నారు. సిద్ధార్థ మ‌ల్హోత్రా వంట చేయ‌గా.. హీరోయిన్ ర‌కుల్ సాయం చేసింది. ఈ ఫోటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసుకొని.. త‌న టూర్ ముచ్చ‌ట్ల‌ను వెల్ల‌డించారు చిత్ర  బృందం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు