మరో రీమేకా పవన్‌??

 మరో రీమేకా పవన్‌??

పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి థియేటర్లలో అండర్ పెర్ఫామ్ చేస్తోంది. కంటెంట్ అభిమానులను కూడా ఆకట్టుకోలేకపోయిందనే విమర్శల కారణంగా..  కలెక్షన్స్ బాగా పడిపోయాయి. ఇప్పుడు పవన్ తర్వాత ఏం చేయనున్నాడనే ఆసక్తి అంతటా కనిపిస్తోంది.

త్రివిక్రమ్ తో చేసిన సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర వసూళ్లను రాబట్టలేకపోవడం.. టాలీవుడ్ లో అత్యధిక నష్టాలను మిగల్చనుందనే అంచనాలు.. పవన్ కళ్యాణ్ ను ఆలోచనలో పడేసిందట. ఇప్పటికే ఒకరిద్దరు నిర్మాతలకు పవన్ కమిట్మెంట్ ఇచ్చాడనే టాక్ ముందు నుంచి ఉంది. పవన్ ఇప్పుడు మరో రీమేక్ ను తెరకెక్కించే యోచనలో ఉన్నాడట. అందుకు తగ్గ ఏర్పాట్లు జరుగుతున్నాయట. రీమేక్ చేయడం మాత్రమే కాదు.. ఈ సినిమాను లో బడ్జెట్ లో పూర్తి చేయాలని.. అలాగే వీలైనంత త్వరగా ఈ చిత్రాన్ని ఫినిష్ చేయాలని చూస్తున్నాడట పవన్ కళ్యాణ్.

అయితే.. గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ మూవీ నిరుత్సాహపరిచిన తర్వాత.. ఇలాంటి ఆలోచనే చేశాడు పవర్ స్టార్. అలా రూపొందిన మూవీనే కాటమరాయుడు. కానీ ఆ మూవీ రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి మళ్లీ కమర్షియల్ లెక్కలే బయటకు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఈ తరహా ఆలోచనలే చేసినా.. చివరకు అది ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి. పైగా ఇప్పుడు అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తర్వాత.. మళ్లీ గతంలో మాదిరిగా హై రేట్లకు విక్రయించడం కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు