రాజమౌళిని ఢీకొడతాడని అనుకుంటే..

రాజమౌళిని ఢీకొడతాడని అనుకుంటే..

కెరీర్ ఆరంభంలో మామూలు సినిమాలే తీశాడు రాజమౌళి. అతడిని ఒక సగటు కమర్షియల్ డైరెక్టర్ లాగే చూశారు జనాలు. కానీ రాజమౌళి అసలు సత్తా ఏంటన్నది గత దశాబ్ద కాలంలో అందరికీ అర్థమైంది. ‘మగధీర’తో మొదలుపెట్టి... ‘బాహుబలి’ వరకు అద్భుతమైన సినిమాలతో దేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకునే స్థాయికి చేరాడతను. ఐతే ఇలా తన స్థాయిని పెంచుకుంటున్న సమయంలోనే రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్రివిక్రమ్ శ్రీనివాస్, సుకుమార్ తన కంటే మేటి దర్శకులని.. వాళ్లు వాళ్ల స్టయిల్లో ఏవో సినిమాలు చేసుకుంటున్నారని.. కానీ వాళ్లు కమర్షియల్ సినిమాలు తీయడం మొదలుపెడితే తనను మించిన సినిమాలు తీయగలరని కితాబిచ్చాడు.

జక్కన్న ఇలా అన్నాకే త్రివిక్రమ్ ‘అత్తారింటికి దారేది’ సినిమా తీసి తన సత్తా ఏమిటో చాటి చెప్పాడు. ‘అఆ’ సినిమా అంత పెద్ద సక్సెస్ అయిందన్నా అందులో త్రివిక్రమ్ పాత్రే కీలకం. ఐతే ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో త్రివిక్రమ్ స్థాయే మారిపోతుందని.. రాజమౌళి లాగా ‘బాహుబలి’ లాంటి భారీ సినిమా తీయకపోయినా.. ‘అజ్ఞాతవాసి’తోనే ‘బాహుబలి’కి దీటైన వసూళ్లు రాబట్టి తన స్థాయి ఏంటో చాటి చెబుతాడని.. రాజమౌళికి దీటైన దర్శకుడు అనిపించుకుంటాడని ఆయన అభిమానులు ఆశించారు. కానీ తన కెరీర్లోనే అత్యంత చెత్త సినిమా తీసి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ సినిమా 40-50 కోట్ల మధ్య నష్టాలు తెచ్చిపెడుతుందన్న అంచనాలు వస్తున్నాయి. తెలుగులో అత్యధిక నష్టాలందించిన సినిమాకు దర్శకుడిగా త్రివిక్రమ్ చెత్త రికార్డు అందుకునేలా ఉన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు