అక్కడ సంక్రాంతి విజేత ఎవరంటే?

అక్కడ సంక్రాంతి విజేత ఎవరంటే?

సంక్రాంతికి తెలుగులో రిలీజైన రెండు సినిమాల సంగతి తేలిపోయింది. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల ‘అజ్ఞాతవాసి’కి బ్యాడ్ టాక్ వచ్చింది. బాలయ్య ‘జై సింహా’ పరిస్థితి దాంతో పోలిస్తే కొంచెం మెరుగే కానీ.. గొప్ప టాక్ అయితే లేదు. ఇక డబ్బింగ్ సినిమా ‘గ్యాంగ్’కు తెలుగు రాష్ట్రాల్లో పర్వాలేదనిపించే టాక్ వస్తోంది. ఇక ‘రంగుల రాట్నం’ సంగతే తేలాల్సి ఉంది. ఈ చిత్రం ఆదివారం విడుదల కాబోతోంది. ఇక సంక్రాంతిని తెలుగువాళ్ల లాగే తమిళులూ చాలా ప్రత్యేకంగా భావిస్తారు. భారీ స్థాయిలో సినిమాలు రిలీజ్ చేస్తారు. అక్కడ నాలుగైదు సినిమాలు రిలీజయ్యాయి పండక్కి. అందులో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించినవి మూడే.

ఈ మూడింట్లో సూర్య సినిమా ‘తానా సేంద కూట్టం’ (తెలుగులో గ్యాంగ్)కే తమిళ ప్రేక్షకులు పట్టం కట్టేటట్లు కనిపిస్తోంది. ఈ చిత్రానికి తమిళంలో చాలా మంచి రివ్యూలొచ్చాయి. ప్రధాన సమక్షకులందరూ మినిమం 3 రేటింగ్ ఇచ్చారు ఈ సినిమాకు. ఈ సినిమా హిట్ అని అక్కడి జనాలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక విక్రమ్-తమన్నా జంటగా నటించిన ‘స్కెచ్’కు ఏమంత మంచి టాక్ రాలేదు. విక్రమ్ గత సినిమాల కంటే బెటర్ అంటున్నారు తప్పితే సినిమా చాలా బాగుందని మాత్రం అనడం లేదు. ఐతే ప్రభుదేవా-హన్సిక జంటగా నటించిన ‘గుళేబగావలి’కి దీంతో పోలిస్తే బెటర్ టాక్ వచ్చింది. ఓ నిధి అన్వేషణ నేపథ్యంలో సరదాగా ఈ సినిమా సాగుతుందట. ఎంటర్టైన్మెంట్ విషయంలో ఈ సినిమాకు మార్కులు పడ్డాయి. ప్రభుదేవా డ్యాన్సుల గురించి కూడా చర్చ నడుస్తోంది. ఈ సినిమా రెండో స్థానంలో నిలిచేలా ఉంది. విక్రమ్ సినిమా మూడో స్థానానికి పరిమితం అయ్యేలా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు