రాధేశ్యామ్ డీల్ డ‌న్?

బాహుబ‌లి త‌ర్వాత ప్ర‌భాస్ నుంచి వ‌చ్చిన సాహో పెద్ద డిజాస్ట‌ర్. అయితేనేం.. ఆ ప్ర‌భావం ఏమీ ప్ర‌భాస్ కొత్త చిత్రాల మీద క‌నిపించ‌ట్లేదు. వంద‌ల కోట్ల బ‌డ్జెట్లు.. అంత‌కుమించి బిజినెస్ ఆఫ‌ర్ల‌తో ప్ర‌భాస్ స్థాయి ఏంటో చూపిస్తున్నాయి అత‌డి కొత్త చిత్రాలు. ప్ర‌భాస్ ప్ర‌స్తుతం న‌టిస్తున్న చిత్రాల్లోకెల్లా లో బ‌జ్ ఉన్న రాధేశ్యామ్‌కు కూడా ట్రేడ్ వ‌ర్గాల్లో మంచి క్రేజే ఉన్న సంగ‌తి స్ప‌ష్టంగా తెలుస్తోంది.

క‌రోనా నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని రూ.400 కోట్ల‌కు హోల్‌సేల్‌గా కొనేసి డిజిట‌ల్ రిలీజ్ చేయ‌డానికి ఓ ప్ర‌ముఖ ఓటీటీ ముందుకొచ్చిన‌ట్లు వార్త‌లు రావ‌డం తెలిసిందే. కానీ రాధేశ్యామ్ మేక‌ర్స్ ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించార‌ట‌. థియేట్రిక‌ల్ హ‌క్కుల‌తో పాటు డిజిట‌ల్, శాటిలైట్ రైట్స్‌ను విడి విడిగా అమ్మితే ఇంకా ఎక్కువ ఆదాయం రాబ‌ట్ట‌వ‌చ్చ‌న్న‌ది వాళ్ల ఆలోచ‌న‌గా ఉంది.

ఈ క్ర‌మంలోనే రాధేశ్యామ్ డిజిట‌ల్, శాటిలైట్ హ‌క్కుల‌ను యువి క్రియేష‌న్స్ సంస్థ భారీ మొత్తానికి అమ్మేసిన‌ట్లు సమాచారం. హిందీ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని జీ5 స్ట్రీమ్ చేయ‌నుంద‌ట‌. ఈ చిత్ర శాటిలైట్ హ‌క్కుల‌ను సైతం జీ గ్రూప్ సొంతం చేసుకుంద‌ని.. వివిధ భాష‌ల్లోని జీ ఛానెళ్ల‌లో ఈ సినిమాను రిలీజ్ త‌ర్వాత కొన్ని నెల‌ల‌కు ప్ర‌సారం చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. డిజిటల్, శాటిలైట్ హ‌క్కులు క‌లిపి ఎంత ప‌లికాయ‌న్న‌ది వెల్ల‌డి కాలేదు.

కానీ ప్ర‌భాస్ కెరీర్లో అత్య‌ధిక మొత్తం అనే అంటున్నారు. అది త‌క్కువ‌లో త‌క్కువ రూ.200 కోట్ల దాకా ఉండొచ్చ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉండ‌గా.. ద‌స‌రా స‌మ‌యానికి ప‌రిస్థితులు బాగుంటే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయాల‌నుకుంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావాలే కానీ.. రూ.300 కోట్ల వ‌సూళ్ల మార్కును ఈజీగా అందుకునే స‌త్తా ఉంది ప్ర‌భాస్‌కు.