మహేష్‌బాబు ప్రొడక్షన్‌లో నాని?

మహేష్‌బాబు ప్రొడక్షన్‌లో నాని?

మహేష్‌బాబు తల్లి ఇందిర పేరు మీద స్థాపించిన ఇందిరా ప్రొడక్షన్స్‌ని తిరిగి మళ్లీ బిజీ చేసే పనిలో మహేష్‌ సోదరి మంజుల నిమగ్నమయింది. స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న మనసుకు నచ్చింది చిత్రంతో మంజుల కొన్ని రోజులుగా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న ఈచిత్రం జనవరి 26న రానుంది. ఈ చిత్రం కంటే కూడా ఆమె తదుపరి ప్లాన్‌ చేస్తోన్న చిత్రం ఆసక్తి కలిగిస్తోంది.

మంచి ఫామ్‌లో వున్న నానితో ఇందిరా ప్రొడక్షన్స్‌లో ఒక సినిమాకి ప్లాన్స్‌ జరుగుతున్నాయి. ఇందిరా ప్రొడక్షన్స్‌కి నాని డేట్స్‌ ఇచ్చాడని వార్తలొస్తున్నాయి. ఈ చిత్రం భారీ స్థాయిలో వుంటుందని, దర్శకుడు కూడా మనం ఫేమ్‌ విక్రమ్‌ కుమార్‌ అని సమాచారం. హలో తర్వాత విక్రమ్‌ తీసే సినిమా ఇదే అవుతుందట. అయితే ఈ ప్రాజెక్ట్‌ని ఇంతవరకు నాని, విక్రమ్‌ లేదా మంజుల అధికారికంగా ఖరారు చేయలేదు.

నాని 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' రిలీజ్‌కి సిద్ధంగా వుండగా, అతను నటిస్తోన్న కృష్ణార్జున యుద్ధం కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఆ చిత్రం తర్వాత నాని దీనిని మొదలు పెడతాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు