ఈ సీనియర్లంతా బాలయ్యను ఏం చేస్తారో?

ఈ సీనియర్లంతా బాలయ్యను ఏం చేస్తారో?

సినిమాలు చకచకా పూర్తి చేయడంలోనే కాదు.. అసలు ఒప్పుకోవడంలోనే వెర్సటాలిటీ చూపిస్తారు నందమూరి బాలకృష్ణ. ఆయన వందో సినిమాగా గౌతమిపుత్ర శాతకర్ణి చేయడం.. ఆఖరి నిమిషంలో జరిగిన డెవలప్మెంట్. చారిత్రక చిత్రం చేసిన వెంటనే.. పైసా వసూల్ అంటూ పూరీతో సినిమా చేస్తారని కూడా ఊహించలేం.

ఇప్పుడు కేఎస్ రవికుమార్ తో జై సింహా చేస్తున్నారు బాలయ్య. వచ్చే నెలలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఫ్యాంటసీ జోనర్ సినిమా మొదలవుతుందని అంటున్నారు. ఆ వెంటనే తేజ డైరెక్షన్ లో ఎన్టీఆర్ బయోపిక్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా వరుసగా ముగ్గురు సీనియర్ దర్శకులకు వరుసగా ఆఫర్స్ ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

కేఎస్ రవికుమార్ కు గత కొన్నేళ్లుగా సక్సెస్ అనేదే లేదు. అయినా సరే.. ధైర్యంగా జైసింహా చేస్తున్నారు బాలకృష్ణ. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి అయితే.. డైరెక్షన్ వహించి చాలా కాలమే అయింది. అయినా సరే స్క్రిప్ట్ నచ్చేసి ఛాన్స్ ఇచ్చారు బాలయ్య.

ఇక తేజ విషయానికి వస్తే.. ఈయన కూడా వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడ్డా.. నేనే రాజు నేనే మంత్రి అంటూ రీసెంట్ గా సక్సెస్ కొట్టారు. ఇది పొలిటికల్ మూవీ కాగా.. ఇప్పుడు వెంకీతో తీస్తున్న మూవీ జోనర్ కూడా ఇదే. ఆ వెంటనే బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ ని కూడా ఇదే జోనర్ మిక్స్ చేసి తీయాల్సి ఉంటుంది. ఏళ్ల తరబడి సక్సెస్ లు లేని దర్శకులు అంతా కలిసి బాలయ్యను ఏం చేస్తారో అనుకుంటున్నారు అభిమానులు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు