జగన్ సారూ.. ఈ అతికి హద్దుండదా?

జగన్ సారూ.. ఈ అతికి హద్దుండదా?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్ర మీద ఎన్నెన్ని సెటైర్లు పడ్డాయో సోషల్ మీడియాలో. ఆ యాత్ర సందర్భంగా జగన్ జనాల్ని ఓదార్చే తీరు ఒక దశ దాటాక చాలా కామెడీ అయిపోయింది. అతను తల మీద చేయి పెట్టి దీవించడాలు.. బుగ్గలు నిమరడాలు.. మరికొన్ని చేష్టల మీద సోషల్ మీడియాలో చాలా ట్రోలింగ్ నడిచింది. మామూలుగానే జగన్ చేసే పనులు కొంచెం అతిగా అనిపిస్తే.. సాక్షి పత్రిక కొన్ని డ్రమటైజ్డ్ వార్తలు ఇస్తూ జగన్‌ను మరింతగా డ్యామేజ్ చేసేది. ఇప్పుడు పాదయాత్రలో సైతం జగన్ తీరు.. సాక్షి పత్రిక కవరేజీ ఇలాగే ఉంటున్నాయి.

తాజాగా ఒక గుండెజబ్బు బాధితుడి విషయంలో జగన్ స్పందన.. దీనికి సంబంధించిన వార్తను సాక్షి పత్రిక ప్రెజెంట్ చేసిన తీరు సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశం అయ్యాయి. ప్రస్తుతం జగన్ యాత్ర గుత్తి ప్రాంతంలో సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కర్నూలు జిల్లాలోని ఓ పల్లెటూరికి చెందిన కిరణ్ కుమార్ అనే కుర్రాడు పాదయాత్రలో జగన్‌ను కలిశాడు.

తమది నిరుపేద కుటుంబమని.. తాను తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని.. అత్యవసరంగా రూ.5 లక్షలు పెట్టి మెదడుకు శస్త్రచికిత్స చేయాల్సి ఉందని.. తనకు సాయం చేసి పుణ్యం కట్టుకోవాలని జగన్‌ను విన్నవించాడు. దీనిపై జగన్ ఆశ్చర్యకర రీతిలో స్పందించాడు. తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆపరేషన్ చేయిస్తా అని అభయమిచ్చాడు జగన్.

తాను ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని.. వెంటనే సర్జరీ చేయాలి సాయం చేయమంటే ఎప్పుడో 2019లో ఎన్నికలు జరిగాక తమ పార్టీలో అధికారంలోకి వచ్చాక సర్జరీ చేయిస్తామని జగన్ అనడమే విడ్డూరమంటే.. దీన్ని అలాగే సాక్షి పత్రిక వార్తగా ఇవ్వడాన్ని ఇంకేమనాలి? ఇలాంటి వార్తలతో సాక్షి జగన్‌కు ఎంత డ్యామేజ్ చేస్తోందన్నది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాలకు అర్థమవుతోందా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు