బయటకెళ్ళి చూస్కో అఖిల్.. నా వల్ల కాదు

బయటకెళ్ళి చూస్కో అఖిల్.. నా వల్ల కాదు

ఏదన్నా కామెంట్ చేస్తే.. అందులో ఏమాత్రం మర్మం లేకుండా క్రిస్టల్ క్లియర్ గా మాట్లేడేస్తారు అక్కినేని నాగార్జున. అంతే కాకుండా డైరక్టుగా తనకు నచ్చిన ప్రశ్నను అడిగినవారిపై ఆయన కోప్పడుతుంటారు కూడా. ఇకపోతే ఇప్పుడు అఖిల్ కోసం ఆల్రెడీ 'హలో' అంటూ భారీగా టైమ్ వెచ్చిస్తున్న నాగార్జున.. మరి తరువాత తన చిన్న కొడుక్కోసం ఏ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నారట??

ఇదే విషయం నాగ్ ను అడిగితే.. అంత సీన్ లేదు అంటున్నారు. ''నేను ఈ సినిమా వరకే చూస్తాను. అది కూడా నా ప్రొడక్షన్ కాబట్టి.. నేను అఖిల్ ను ఎలా లాంచ్ చేయాలని అనుకుంటానో అలా చేస్తున్నాను. నిన్ననే తనకు కూడా క్లారిటీ ఇచ్చాను. బయటకెళ్ళి చూస్కో.. మంచి కథలను వెతికి సినిమాలను చేయి అన్నాను. ఒకవేళ నా దగ్గరకు ఏదన్నా మంచి కథ వస్తే ఖచ్చితంగా తనకు చెప్తా. కాని చేయిపట్టుకుని నడిపించలేను. నేను కూడా సినిమాలు చేసుకోవాలి.. ప్రొడక్షన్ చూసుకోవాలికదా'' అంటూ నవ్వేశారు నాగ్.

మొత్తానికి తన కొడుకుకి కూడా చాలా సీరియస్ మ్యాటర్ ను భలే సింపుల్ గా చెప్పేశారనమాట. మరి బయటకు వెళ్లి అఖిల్ బాబు 'అఖిల్' వంటి కతలను కాకుండా మంచివి వెతుక్కుంటే మంచిది!!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు