మెగా క్యాంప్‌లో పడితే పంట పండినట్టే

మెగా క్యాంప్‌లో పడితే పంట పండినట్టే

ఫీల్డులో అయిదారుగురు హీరోలున్న మెగా కాంపౌండ్‌లోకి, అందునా అగ్ర హీరోలైన పవన్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ సినిమాలోకి కనుక ఎవరికైనా అవకాశం దక్కితే ఇక ఆ హీరోయిన్‌ పంట పండినట్టే. మెగా కాంపౌండ్‌లోకి ఎంటర్‌ అయి వరుసగా వారందరితో చేసిన హీరోయిన్లు చాలా మందే వున్నారు. పవన్‌తో అజ్ఞాతవాసిలో నటిస్తోన్న అను ఎమాన్యుయేల్‌కి ఆ సినిమా విడుదల కాకముందే అల్లు అర్జున్‌ 'నా పేరు సూర్య'లో ఛాన్స్‌ వచ్చింది.

తాజాగా ఆమెకి చరణ్‌ నుంచి కూడా కబురొచ్చింది. చరణ్‌ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఒక కథానాయికగా అను ఎమాన్యుయేల్‌ ఎంపికైంది. మజ్నుతో ఎంటర్‌ అయిన అను ఎమాన్యుయేల్‌కి రీసెంట్‌గా ఆక్సిజన్‌తో ఎదురు దెబ్బ తగిలింది.

కానీ చేతిలో మూడు మెగా సినిమాలతో ఈమె కెరియర్‌కి ఏమాత్రం ఢోకా లేనట్టే. ఒక్కసారి మెగా ఫ్యామిలీలో ముగ్గురు టాప్‌ హీరోలతో నటించేసాక ఆమెకి మరిన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు తన్నుకుంటూ వస్తాయి.

రానున్న రోజుల్లో అను ఎమాన్యుయేల్‌ కూడా తెలుగు సినిమాకి స్టార్‌ హీరోయిన్‌ అయిపోతుందేమో. ప్రస్తుతానికైతే పారితోషికం పెంచకుండా వచ్చిన అవకాశాల మీద కెరియర్‌ నిర్మించుకుంటోందట. తెలివైన పిల్లే సుమీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు