అజ్ఞాతవాసికి సంబరాలేం వుండవంట

అజ్ఞాతవాసికి సంబరాలేం వుండవంట

అజ్ఞాతవాసి షూటింగ్‌కి గుమ్మడికాయ కొట్టారో లేదో 'చలోరే చల్‌' అంటూ పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ యాత్ర మొదలు పెట్టేసాడు. మరో నెల రోజుల్లో రిలీజ్‌ వుందనగా, ఇక ఈ చిత్రం కోసం పవన్‌ సమయం ఏమీ కేటాయించడట. ఒక రెండు రోజులు మాత్రం డబ్బింగ్‌కి డేట్స్‌ ఇచ్చాడని, ఆ తర్వాత ఇక మొత్తం త్రివిక్రమ్‌ చూసుకోవాల్సిందేనని భోగట్టా. ఈ చిత్రానికి విడుదలకి ముందు ఆడియో ఫంక్షన్‌, ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లాంటివి ఏమీ వద్దని పవన్‌ చెప్పాడట.

తను పాలిటిక్స్‌తో బిజీగా వుంటాడు కనుక ప్రమోషన్‌కి సమయం ఇవ్వలేనని నిర్మాత, దర్శకులకి తెలియజెప్పాడని ఇన్‌సైడ్‌ టాక్‌. అయితే ఇంత భారీ చిత్రానికి కనీసం ఒక్క వేడుక అయినా చేయకపోతే ఎలా అని అభిమానులు నిరాశ పడుతున్నారు.

మరి పవన్‌ని కన్విన్స్‌ చేసుకుని ఒక సాయంత్రం టైమ్‌ తీసుకోగలిగితే ఏదైనా సంబరం లాంటిది చిన్న వెన్యూలో చేసుకోవచ్చు. పూర్తిగా పవన్‌ డెసిషన్‌ మీదే అది ఆధారపడుతుంది కానీ లేదంటే అజ్ఞాతవాసికి ట్రెయిలర్‌, ఆడియో అన్నీ ఎలాంటి సందడి లేకుండా డైరెక్టుగా రిలీజ్‌ అయిపోతాయి.

డిసెంబర్‌ 20 లోగా మంచి ముహూర్తం చూసి పాటలు విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఈలోగా ఒక సింగిల్‌ని మాత్రం యూట్యూబ్‌ ద్వారా విడుదల చేస్తారట. అదండీ సంగతి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు