ఆ డైరెక్టర్ కి నాగ్ తో ఇబ్బందులు?

ఆ డైరెక్టర్ కి నాగ్ తో ఇబ్బందులు?

కొత్త దర్శకులను ఎంకరేజ్ చేయడంలో నాగ్ రూటే సెపరేటు. స్టార్ హీరో అయినా సరే ఎంతో ధైర్యంగా కొత్తవాళ్లకు ఛాన్స్ ఇచ్చేస్తారు నాగ్. అలాంటి నాగార్జున.. ఓ దర్శకుడి ఫ్యూచర్ కి ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలు వినిపించడం ఆశ్చర్యకరమైన విషయమే. అది కూడా తన కెరీర్ లోనే బెస్ట్ హిట్ ఇచ్చిన కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టును నాగ్ అడ్డుకున్నారనే మాటలు.. ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయాయి.

సోగ్గాడే చిన్ని నాయన మూవీతో నాగార్జునకు బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో పాటు.. తనకు గ్రాండ్ లాంఛింగ్ కూడా ఇచ్చుకున్నాడు కళ్యాణ్ కృష్ణ. సోగ్గాడే మూవీలోని బంగార్రాజు పాత్రతో ప్రీక్వెల్ తీస్తానని గతంలోనే ప్రకటించాడు కూడా. అయితే.. ఈలోగా రా రండోయ్ వేడుక చూద్దాం అంటూ నాగచైతన్యకు కూడా మంచి హిట్టిచ్చాడు ఈ దర్శకుడు.

కానీ సోగ్గాడే విడుదలకు ముందే.. అన్నపూర్ణ బ్యానర్ పై మూడు సినిమాలను వరుసగా తీసేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్నాడట కళ్యాణ్ కృష్ణ. అయితే బంగార్రాజు స్క్రిప్ట్ విషయంలో నాగ్ సంతృప్తి చెందకపోవడంతో మరో సినిమా ఏదీ ప్రారంభం కాలేదు.

అటు నాగ్.. ఇటు చైతు.. ఇద్దరూ కొత్త సినిమాలతో బిజీ అయిపోవడంతో.. రవితేజతో మూవీ తీసేందుకు కమిట్ అయ్యాడు కళ్యాణ్ కృష్ణ. ఇవాళే ఆ సినిమా ప్రారంభం కావాల్సి ఉండగా.. తమ సంస్థతో ఒప్పందం విషయాన్ని చూపి.. నాగార్జునే ఈ సినిమా ప్రారంభాన్ని అడ్డుకున్నారనే టాక్ వినిపిస్తోంది. ఓ కొత్త దర్శకుడి ఫ్యూచర్ కి నాగార్జున అడ్డుపడడమేంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు