మరీ ఇంత బ్యాడ్ టాక్ ఏంటి రత్తాలూ

మరీ ఇంత బ్యాడ్ టాక్ ఏంటి రత్తాలూ

దక్షిణాదిన రాయ్ లక్ష్మీ ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా చేసిన సినిమాలు చాలా తక్కువ. ఆమె ఎక్కువగా వ్యాంప్ తరహా పాత్రలు.. ఐటెం పాటలతోనే నెట్టుకొచ్చింది. ఐతే బాలీవుడ్లో మాత్రం రాయ్ లక్ష్మీని కథానాయికగా పెట్టి ‘జూలీ-2’ సినిమా తీసేశారు. దక్షిణాదిక కెరీర్ దాదాపుగా క్లోజ్ అయిపోయిన స్థితిలో హిందీలో ఇలాంటి అవకాశం రావడం ఆశ్చర్యమే. బాలీవుడ్లో ఆమెకిది డ్రీమ్ డెబ్యూ అనే చెప్పాలి. పబ్లిసిటీ గిమ్మిక్కులు బాగానే చేసి ఈ చిత్రానికి విడుదలకు ముందు కొంచెం హైప్ తీసుకురావడంలో చిత్ర బృందం విజయవంతమైంది. ఈ శుక్రవారం మంచి అంచనాల మధ్య రిలీజైందీ సినిమా.

ఐతే ఓ మోస్తరుగా ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ.. ‘జూలీ-2’ నిలబడేలా అయితే లేదు. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చింది. రివ్యూలన్నీ కూడా నెగెటివ్ గానే ఉన్నాయి. ఏ క్రిటిక్ కూడా ఈ సినిమా గురించి పాజిటివ్ రాయలేదు. మంరి రేటింగ్స్ ఇవ్వలేదు. రాయ్ లక్ష్మీ అందాల ప్రదర్శన తప్ప సినిమాలో ఏమీ లేదని తేల్చేశారు. ఈ మాత్రం అందాల ప్రదర్శన చేయడానికి బాలీవుడ్లో చాలామంది హీరోయిన్లున్నారు. ఇంటిమేట్ సీన్ల విషయంలో దీని కంటే మించిన సినిమాలు చాలా వచ్చాయి బాలీవుడ్లో. కాకపోతే రాయ్ లక్ష్మీ కొంచెం కొత్తగా అనిపించింది హిందీ జనాలకు. వీకెండ్ తర్వాత ఈ సినిమా నిలబడటం కష్టమే అంటున్నారు. రాయ్ లక్ష్మీకి దీని తర్వాత హిందీలో అవకాశాలు రావడం కష్టమే అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు