#PSPK25లో ఐటెం సాంగ్ అలా..

 #PSPK25లో ఐటెం సాంగ్ అలా..

సినిమాలకు ఐటెం సాంగ్ అంటే వాల్యూ అడిషన్ అని చెప్పాల్సిన పని లేదు. స్టార్ హీరోల మూవీస్ లో అయితే.. వీటికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అంతే కాదు.. మూవీలోని అన్ని పాటల్లోకి ఈ ఐటెం సాంగ్ హైలైట్ అవుతూ ఉంటుంది.

పవన్ కళ్యాణ్ 25వ చిత్రంలో కూడా ఇలా ఓ ఐటెం సాంగ్ ఉంటుందని గతంలోనే వార్తలు వచ్చాయి. చిత్రీకరణ పూర్తయిందో లేదో ఇంకా డీటెయిల్స్ బయటకు చెప్పలేదు కానీ.. PSPK25లో ఉన్న ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే నటిస్తోందనే టాక్ వినిపించింది. అయితే.. ఈ పాట ఐటెం సాంగ్ మాదిరిగా కాకుండా.. సిట్యుయేషన్ ప్రకారం వచ్చే స్పెషల్ సాంగ్ లా ఉంటుందట. పవన్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రంలో 'ఇట్స్ టైం టు పార్టీ నౌ' అంటూ సాగే లేడీస్ పాట ఎంతగా క్లిక్ అయిందో తెలిసిందే. ఇప్పుడు అనిరుధ్ రవిచందర్ కంపోజింగ్ లో ఇలాంటి ఓ అద్భుతమైన సాంగ్ ను రికార్డింగ్ చేశారని తెలుస్తోంది.

ఇప్పటివరకూ ధనుష్ కి ఇలాంటి స్పెషల్ సాంగ్స్ ఇచ్చిన అనిరుధ్.. తొలిసారిగా పవన్ కళ్యాణ్ కు సంగీతం అందిస్తూ కూడా ఓ అధ్భుతమైన ట్యూన్ ను అందించాడని అంటున్నారు. సాధారణంగా ఐటెం సాంగ్స్ అంటే వినిపించే హై ఓల్టేజ్ మ్యూజిక్ కాకుండా.. సింపుల్ గానే ఉంటూ సూపర్బ్ గా ఉండే ఓ ట్యూన్ ను ఇచ్చిన అనిరుధ్.. మొత్తం ఆల్బంలో ఇదే హైలైట్ అయ్యేలా జాగ్రత్త పడ్డాడని తెలుస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు